ఈవారం చిన్న సినిమాలన్నీ భారీ ప్లాప్.. బాక్సాఫీస్ దగ్గర డెడ్ ఓపెనింగ్స్..

ప్రతీ శుక్రవారం సినీ ప్రేక్షకులకు పండగ అనే చెప్పాలి.ఎందుకంటే ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం ఉంటుంది.

 Tollywood Small Movies Came Out This Week Chor Bazaar Sammathame Konda Karan Arj-TeluguStop.com

కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాయి.ప్రతీ వారం లాగానే ఈసారి కూడా బాక్సాఫీస్ బరిలో చాలా సినిమాలు వచ్చాయి.

అన్ని కూడా చిన్న సినిమాలే. అయితే అన్ని సినిమాలు వచ్చిన కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.

అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి డెడ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టాయి.

సమ్మర్ అయిపోవడంతో పెద్ద సినిమాల జోరు తగ్గింది.

వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో చిన్న సినిమాలకు రిలీజ్ డేట్ లు దొరకలేదు.అయితే ఇప్పుడు పేడ్ సినిమాల జోరు తగ్గడంతో చిన్న సినిమాలన్నీ ఒకేసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసాయి.

కానీ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేక పోయాయి.మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ ‘చోర్ బజార్’ సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.గెహన సిప్పీ కథానాయికగా నటించిన ఈ సినిమాను జీవం రెడ్డి తెరకెక్కించారు.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చోర్ బజార్ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా.ఐవి ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ వారు రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేసారు.అయితే ఈ సినిమా ఆకట్టుకోలేక మొదటి రోజే చతికిల పడింది.

Telugu Days Nights, Chor Bazar, Konda, Sammathame, Software Blues, Tollywood Sma

ఎం ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 7 డేస్ 6 నైట్స్. ఈ సినిమా కూడా నిన్న రిలీజ్ అయ్యింది.బలహీనమైన కథ, కథనంతో ఆడియెన్స్ ను మెప్పించలేక పోయింది.

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కొండా.

వరంగల్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా కూడా బలహీనమైన కథతో ఏమాత్రం ఆసక్తిగా లేకపోవడంతో ప్రేక్షకులు రిజక్ట్ చేసారు.

కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా సమ్మతమే.గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించగా నిన్న ఈ సినిమాను రిలీజ్ చేసారు.అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది.

Telugu Days Nights, Chor Bazar, Konda, Sammathame, Software Blues, Tollywood Sma

లక్ష్ చదలవాడ హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ స్టర్ గంగరాజు. ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది కానీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోయింది.అలాగే సాఫ్ట్ వేర్ బ్లుస్, కరణ్ అర్జున్, సద నన్ను నడిపే వంటి మరొక మూడు సినిమాలు వచ్చాయి.

కానీ ఇవి వచ్చినట్టు కూడా ఎవ్వరికి తెలియలేదు.ఇలా నిన్న రిలీజ్ అయినా ఈ చిన్న సినిమాలు ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయాయి.అలాగే ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి.మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ వారంలో 40 కోట్ల నష్టం వాటిల్లినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube