పెళ్లితో ఒక్కటైన టాలీవుడ్ సింగర్స్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎంతో కామన్.పలువురు హీరోలు, హీరోయిన్లు తాము నటించిన సినిమాల ద్వారా దగ్గరై మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సందర్భాలు కోకొల్లలుగా చూశాం.

 Tollywood Singers Married Their Cosingers, Telugu Singers, Malli Karjuna-gopika-TeluguStop.com

ఇక సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా చాలామంది తమకు నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకున్నారు.అందులో కొందరు సింగర్స్ తమ తోటి సింగర్స్ ని, మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెళ్లి చేసుకున్నారు.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

మల్లిఖార్జున్-గోపిక పూర్ణిమ

సింగర్ మల్లికార్జున్ తెలుగులో ఎన్నో సినిమాల్లో పాటలు పాడాడు.ఇదే సమయంలో పరిచయం అయినా సహ సింగర్ గోపిక పూర్ణిమాతో ప్రేమలో పడ్డాడు.సీన్ కట్ చేస్తే 2008లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

హేమచంద్ర- శ్రావణ భార్గవి

Telugu Gvprakash, Mallikarjuna, Telgu Singers, Tippu Harini-Telugu Stop Exclusiv

టాలీవుడ్ లో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న హేమచంద్ర తన సహ సింగర్ శ్రావణ భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్ద వాళ్ళు సైతం ఒప్పుకున్నారు.వీరి వివాహం ఘనంగా జరిపించారు.

టిప్పూ- హరిణి

Telugu Gvprakash, Mallikarjuna, Telgu Singers, Tippu Harini-Telugu Stop Exclusiv

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ టిప్పూ కూడా తన కో సింగర్ హరిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఈమె తెలుగులో 100కి పైగా సాంగ్స్ పాడింది.

తమన్- శ్రీ వర్దిని

Telugu Gvprakash, Mallikarjuna, Telgu Singers, Tippu Harini-Telugu Stop Exclusiv

తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా సింగర్ శ్రీ వర్దిని ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.ఈమె తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది.

జివి ప్రకాష్- సైన్ధవి

Telugu Gvprakash, Mallikarjuna, Telgu Singers, Tippu Harini-Telugu Stop Exclusiv

మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ మేనల్లుడు జివి ప్రకాష్ తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట మూవీస్ కి మ్యూజిక్ అందించాడు.ఈయన కో సింగర్ సైన్ధవి తో ప్రేమలో పడ్డాడు.2013లో పెళ్లి చేసుకున్నారు.ఈమె తెలుగులో గంగోత్రి, ఇష్క్, ఖలేజా సహా పలు సినిమాల్లో పాటలు పాడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube