పునర్నవి భూపాళం నిశ్చితార్థంపై కామెంట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్…  

Tollywood singer Rahul sipligunj comments on Punarnavi bhupalam Engagement, Rahul Sipligunj, Punarnavi Bhupalam, Young actress, Tollywood, Punarnavi bhupalam Engagement news, Udbhav Raghunandan,  - Telugu Punarnavi Bhupalam, Punarnavi Bhupalam Engagement News, Rahul Sipligunj, Tollywood, Tollywood Singer Rahul Sipligunj Comments On Punarnavi Bhupalam Engagement, Udbhav Raghunandan, Young Actress

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు సెలబ్రెటీలపై పలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.అయితే తాజాగా తెలుగులో మంచి పాపులర్ అయినటువంటి బిగ్ బాస్ ప్రముఖ రియాల్టీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యంగ్ హీరోయిన్ పునర్నవి భూపాళం టాలీవుడ్ యంగ్ నటుడు మరియు రైటర్ రఘునందన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

TeluguStop.com - Tollywood Singer Rahul Sipligunj Comments On Punarnavi Bhupalam Engagement

 అంతేగాక తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నట్లు కూడా పునర్నవి తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది.

అయితే పునర్నవి భూపాళం బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలో టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.

TeluguStop.com - పునర్నవి భూపాళం నిశ్చితార్థంపై కామెంట్ చేసిన రాహుల్ సిప్లిగంజ్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దాంతో అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపించాయి.కానీ ఆ మధ్య కాలంలో పునర్నవి భూపాళం మరియు రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ తమ ప్రేమాయణం విషయంపై స్పందిస్తూ తాము కేవలం మంచి స్నేహితులని తమ మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని స్పష్టం చేశారు.

అయితే తాజాగా పునర్నవి భూపాళం నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు  ప్రకటించడంతో కొందరు నెటిజన్లు  కావాలని రాహుల్ సిప్లిగంజ్ నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. దీంతో తాజాగా రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ ఎవరికో నిశ్చితార్థం జరుగుతుంటే నన్నెందుకు  ట్రోల్స్  మరియు ట్యాగ్ చేస్తున్నారంటూ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు.

దీంతో రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో మరింత దుమారం రేపుతున్నాయి.

అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల పై అసత్య ప్రచారాలు చేసి పాపులర్ కావాలని చూస్తున్నారని ఇది సరికాదని అంటున్నారు.

 అంతేగాక నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటివారిపై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం కరెక్ట్ కాదని అంటున్నారు.

#Rahul Sipligunj #TollywoodSinger #Young Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Singer Rahul Sipligunj Comments On Punarnavi Bhupalam Engagement Related Telugu News,Photos/Pics,Images..