టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ హరిణి కుటుంబ సభ్యులు మొత్తం గత వారం రోజుల నుంచి అదృశ్యమయ్యారు.హైదరాబాదులో నివాసం ఉంటున్న హరిణి కుటుంబం వారం రోజుల నుంచి కనిపించకపోవడంతో బంధువులు ఆందోళన చెంది వారికి ఫోన్లు చేయగా మొత్తం కుటుంబ సభ్యుల ఫోన్ స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే హరిణి కుటుంబం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజు హరిణి తండ్రి ఏకే రావు బెంగళూరులోని రైలు పట్టాల పై శవమై కనిపించారు.
ఈ క్రమంలోనే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అతని శరీర భాగాలపై గాయాలు ఉండడంచేత ఇది ఆత్మహత్య కాదని ఇతనిని ఎవరో మర్డర్ చేసి రైలు పట్టాలపై పడేశారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఈ క్రమంలోనే పోలీసులు అసలు వీరికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వీరి కుటుంబంలో ఏవైనా గొడవలు జరిగాయా? గత వారం రోజులుగా ఈ కుటుంబం ఎందుకు అజ్ఞాతంలో ఉంది? ఇతనిని మర్డర్ చేస్తే మిగిలిన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? అంటూ పలు రకాల సందేహాలు తలెత్తడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.