సోమవారం నుండి షూటింగ్స్‌.. అసలు టాలీవుడ్‌ లో ఏం జరుగుతోంది?

తెలుగు సినిమా పరిశ్రమ లో ఏం జరుగుతుందో అర్థం కాక సామాన్య ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.నిర్మాతలు సమ్మె చేస్తున్నారు అంటూ ఆగస్టు ఒకటో తారీకు నుండి షూటింగ్ దాదాపుగా అన్ని ఆగిపోయాయి.

 Tollywood Shooting Starts From Monday , Flim News , News In Telugu, Telugu Flim Producers, Tollywood, Tollywood Heroes-TeluguStop.com

కొన్ని సినిమాలు టెక్నికల్ అంశాలను చూపిస్తూ, మరి ఇతర అంశాలను చూపిస్తూ షూటింగ్ ని కంటిన్యూ చేశారు.కానీ అవి కూడా కొంత మేరకు ఆగిపోయాయి అనేది సమాచారం.

తాజా సమాచారం ప్రకారం సోమవారం నుండి మళ్లీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.నిర్మాతల మండలి కి చెందిన కొందరు నిర్మాతలు దిల్ రాజు విషయం లో అసంతృప్తి తో ఉన్నారని, ఆ కారణంగానే సమ్మె కు దూరం అవ్వాలని ఆ నిర్మాతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

 Tollywood Shooting Starts From Monday , Flim News , News In Telugu, Telugu Flim Producers, Tollywood, Tollywood Heroes-సోమవారం నుండి షూటింగ్స్‌.. అసలు టాలీవుడ్‌ లో ఏం జరుగుతోంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారు నిర్మాతల మండలి నుండి తప్పుకొని మళ్లీ షూటింగ్ చేసుకోవడం ద్వారా నిర్మాతల మండలికి తమ మద్దతును ఉప సంహరించుకోవాలని భావిస్తున్నారు.కొందరు నిర్మాతలు మాత్రం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అంటూ వారిని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ కి చెందిన పెద్దలు నిర్మాతలు సమ్మెను ఆపే ప్రయత్నాలు చేశారు.అని సఫలమైతే సోమవారం నుండి షూటింగ్ జరిగే అవకాశం ఉంది.ప్రతి ఒక్క టెక్నీషియన్, నటీ నటులు తమ పారితోషికంను తగ్గించుకునే వరకు నిర్మాత లు తమ సమ్మె ను ఉపసంహరించేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నారు, కానీ ఏ ఒక్క సంఘం నుండి కూడా సానుకూల స్పందన రాక పోవడంతో సమ్మె విరమించుకుని సోమవారం నుండి షూటింగ్లో పాల్గొనడం ఉత్తమం అని కొందరు భావిస్తే, మరి కొందరు మాత్రం కొన్ని రోజులు అయితే వారే డిమాండ్ల ను నెరవేర్చేందుకు ఓకే చెప్తారని నిర్మాతలు భావిస్తున్నారు.ఇది ఎంత వరకు సాధ్యమయ్యేనో చూడాలి.

సోమ వారం షూటింగులు జరుగుతాయా లేదా అనేది ఆదివారం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube