అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ నిర్మాత…  

Suicide Attempt, Senior producer, Tollywood Film Industry, Crime news, Telugu movies - Telugu Crime News, Senior Producer, Suicide Attempt, Telugu Movies, Tollywood Film Industry

ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ కరోనా వైరస్ మహమ్మారి మాత్రం ఒక్కసారిగా మానవుల జీవితాల్లో అల్ల కల్లోలం సృష్టించింది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రభావం పలు దేశాల ఆర్థిక పరిస్థితులపై పడింది.

TeluguStop.com - Tollywood Senior Producer Attempted Suicide

Source:TeluguStop.com

అంతేగాక రోజువారి కూలీలు, పూటగడవని పేదలు, పనులు లేక అల్లాడుతున్నారు.అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం సినిమా రంగం పై కూడా పడింది.

TeluguStop.com - అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ నిర్మాత…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో పలు సినిమా నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు తదితరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అయితే తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ ప్రముఖ నిర్మాత అప్పుల బాధ తాళలేక ఆత్మ హత్యాయత్నం చేసినట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

అంతేగాక ఈ సీనియర్ నిర్మాత గతంలో నిర్మించిన చిత్రాలు కూడా ఫ్లాప్ అవడంతో కొంతమేర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా అయినప్పటికీ సినిమాల మీద ఆశ చావకపోవడంతో ఇటీవలే తనకు తెలిసిన వారి దగ్గర నుంచి కొంత డబ్బు అప్పు తెచ్చి మరీ సినిమాని నిర్మిస్తున్నాడట.

కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఆగిపోవడంతో మరోవైపు అప్పు తెచ్చిన డబ్బులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో చేసేదేమీ లేక ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడట.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో షూటింగులు నిర్వహించడానికి అనుమతులు జారీ చేసినప్పటికీ కరోనా కలకలం సృష్టిస్తోంది.దీంతో ప్రభుత్వం అనుమతులు జారీ చేసినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం చిత్రీకరణ పనుల్లో పాల్గొనడానికి జంకుతున్నారు.

#Senior Producer #Suicide Attempt #TollywoodFilm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Senior Producer Attempted Suicide Related Telugu News,Photos/Pics,Images..