సీనియర్ ఎన్టీఆర్ బాలయ్యను ఏం చేయాలనుకున్నారో మీకు తెలుసా..?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాల్లో నటిస్తూ సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకే సినిమా ఆఫర్లను ఇస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.తాజాగా బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ మన సంస్కృతిలో వైద్యో నారాయణో హరి అని పేర్కొన్నారని వ్యాధులతో బాధపడే రోగులకు వైద్యుడు దేవుడిలా కనిపిస్తాడని బాలయ్య చెప్పుకొచ్చారు.

 Senior Nandamuri Taraka Ramarao Wish About Star Hero Nandamuri Balakrishna, Doct-TeluguStop.com

నీతి అయోగ్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని లాభాపేక్ష లేకుండా కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్యం అందిస్తున్న ఆస్పత్రిగా గుర్తించడం సంతోషకరమని బాలకృష్ణ వెల్లడించారు.తండ్రి నందమూరి తారక రామారావు తనను డాక్టర్ చేయాలని అనుకున్నారని తాను డాక్టర్ కాలేకపోయినా ఆస్పత్రికి ఛైర్మన్ గా పని చేస్తూ తండ్రి కోరికను నిజం చేశానని బాలకృష్ణ పేర్కొనడం గమనార్హం.

కరోనా వైరస్ విజృంభించిన సమయంలో వైద్యులు కీలక పాత్ర పోషించారని భవిష్యత్తులో కూడా వైద్యులు ఇదే విధంగా సేవలను కొనసాగించాలని తాను కోరుకుంటున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు.

Telugu Akhanda, Boyapati Srinu, Krack, Senior Ntr, Tollywood-Movie

మరోవైపు బాలయ్య ప్రస్తుతం అఖండలో నటిస్తుండగా దర్శకుడు బోయపాటి శ్రీను క్లైమాక్స్ కోసం కడపలో లొకేషన్లను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.ఈ సినిమా పూర్తైన తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య మూవీ షూటింగ్ మొదలుకానుంది.

Telugu Akhanda, Boyapati Srinu, Krack, Senior Ntr, Tollywood-Movie

క్రాక్ సినిమాతో రవితేజకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలకృష్ణతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.రియల్ పాత్రలతో గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతుండగా ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.మరో మూడు నెలల తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube