టాలీవుడ్ సీనియర్, మిడిల్ రేంజ్ హీరోలలో ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఏ సినిమా ఇండస్ట్రీకి అయినా చిన్న సినిమాలు, మిడిల్ రేంజ్ సినిమాలు కీలకమనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే ఇండస్ట్రీ భారీ మొత్తంలో కలెక్షన్లతో కళకళలాడే అవకాశాలు అయితే ఉంటాయి.

 Tollywood Senior Middle Range Heroes Remunerations Details Here Goes Viral , Sai-TeluguStop.com

కొన్నేళ్ల క్రితం వరకు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కేవి.ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరగడంతో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్న నేపథ్యంలో హీరోలు సినిమాల బడ్జెట్లను , రెమ్యునరేషన్లను భారీగా పెంచేస్తున్నారు.మరి కొందరు స్టార్ హీరోలు గత సినిమాల కలెక్షన్లను చూపించి తమ పారితోషికాలను పెంచేస్తున్నారు.

మిడిల్ రేంజ్ హీరోలలో ఒక్కో హీరో రెమ్యునరేషన్ ఒక్కో విధంగా ఉండటం గమనార్హం.కొందరు సీనియర్ స్టార్ హీరోలు సైతం మిడిల్ రేంజ్ హీరోల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

సీనియర్ హీరోలలో చిరంజీవి రెమ్యునరేషన్ 30 నుంచి 35 కోట్ల రూపాయలుగా ఉండగా రవితేజ 18 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు.బాలయ్య, వెంకటేష్, నాని ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల నుంచి 14 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

రామ్ కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు 12 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని బోగట్టా.

Telugu Chiranjeevi, Heroes, Middlerange, Nagachaitanya, Nithin, Nitin, Saitej, S

మెగా హీరోలు సాయితేజ్, వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు 9 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.నాగచైతన్య 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా అఖిల్ రెమ్యునరేషన్ 7 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.నితిన్, శర్వానంద్, మరి కొందరు హీరోలు 10 కోట్ల రూపాయల లోపు రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube