తన కుటుంబం కోసం ఆ హీరో తన ప్రియురాలిని కూడా వదులుకున్నాడట…  

Tollywood Senior Hero Sai Kiran Love Breakup News Goes Viral In Social Media - Telugu Koilamma, Love Breakup. Telugu Heroine, Nuvve Kavali, Sai Kiran, Staar Maa, Tollywood Senior Hero

తెలుగులో అప్పట్లో ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించినటువంటి “నువ్వే కావాలి” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ చిత్రంలో “అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో  మేఘం ఉంది” అనే పాటలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి హీరో సాయి కిరణ్ గురించి తెలియని వారుండరు.

 Tollywood Senior Hero Sai Kiran Love Breakup News Goes Viral In Social Media

అయితే హీరో సాయి కిరణ్ వచ్చీరావడంతోనే మంచి విజయాన్ని అందుకని వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.కానీ ఆ సినిమాలు ఏవి కూడా సాయి కిరణ్ కి గుర్తింపును తీసుకురాలేకపోయాయి.

అయితే తాజాగా సాయి కిరణ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే సాయి కిరణ్ అప్పట్లో తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రియురాలిని తన కుటుంబ సభ్యుల కోసం వదిలిపెట్టాడని సాయి కిరణ్ ప్రేమ గురించి కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

తన కుటుంబం కోసం ఆ హీరో తన ప్రియురాలిని కూడా వదులుకున్నాడట…-Latest News-Telugu Tollywood Photo Image

కాగా అప్పట్లో సాయి కిరణ్ ప్రేమించినటువంటి మహిళ కూడా తెలుగు సినీ పరిశ్రమకి చెందిన హీరోయిన్ అని, అంతేగాక ఆమెతో సాయి కిరణ్ పలు చిత్రాల్లో నటించాడట.అయితే హీరో సాయి కిరణ్ ప్రముఖ సింగర్ పి.సుశీల మనవడని చాలామందికి ఇప్పటికీ  తెలియదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సాయి కిరణ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో నివాసముంటున్నట్లు సమాచారం.

అలాగే ప్రస్తుతం సాయి కిరణ్ చేతిలో పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో బుల్లితెర మీద బాగానే ఆకట్టుకుంటున్నాడు.

ఇందులో టాలీవుడ్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా ఛానెల్ లో ప్రసారమయ్యే కోయిలమ్మ అనే ధారావాహికలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఏదేమైనప్పటికీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్న సాయి కిరణ్ కి ఆ అవకాశాలన్నీ తీవ్ర నిరాశనే మిగిల్చాయనీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Senior Hero Sai Kiran Love Breakup News Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..

footer-test