అప్పట్లో ఈ తెలుగు హీరోకి శ్రీదేవి ని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందట… కానీ…   

Rajasekhar, Tollywood senior hero, Sridevi, former actress, marriage news, Tollywood - Telugu Former Actress, Marriage News, Rajasekhar, Sridevi, Tollywood, Tollywood Senior Hero

తెలుగులో స్టార్ హీరోయిన్ గా దాదాపుగా రెండు దశాబ్దాల కాలంగా వెలుగొంది అప్పట్లోనే సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “స్వర్గీయ అందాల తార శ్రీదేవి” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈమె భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ శ్రీ దేవి నటించినటువంటి చిత్రాలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.

TeluguStop.com - Tollywood Senior Hero Rajasekhar About His Marriage With Former Actress Sri Devi

అయితే టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఆ మధ్య కాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని స్వర్గీయ నటి శ్రీదేవి కుటుంభం సభ్యులతో ఉన్నటువంటి సంబంధం గురించి పలు ఆసక్తికర అంశాలను తెలిపాడు. అయితే ఇందులో ముఖ్యంగా శ్రీ దేవి కుటుంబ సభ్యులతో తనకి మరియు తన కుటుంబ సభ్యులకి మధ్య మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉండేవని తెలిపాడు.

 ఇందులో భాగంగానే శ్రీదేవి తల్లి అప్పట్లోనే శ్రీదేవిని తనకిచ్చి పెళ్ళి చేయాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రులను  సంప్రదించిందని కానీ తాను పలు  వ్యక్తిగత కారణాల వల్ల శ్రీదేవి తో తన పెళ్లి ప్రపోజల్ ని సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు.

TeluguStop.com - అప్పట్లో ఈ తెలుగు హీరోకి శ్రీదేవి ని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందట… కానీ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేగాక శ్రీదేవి ని తనకిచ్చి పెళ్ళి చేయాలనుకున్న సమయంలో శ్రీదేవి స్టార్ నటిగా రాణిస్తుందని అలాగే తాను కూడా పై చదువులు చదవడానికి ఆసక్తి ఉండటంతో కొంతమేర నిరాకరించారని తన మనసులోని మాటను బయట పెట్టాడు.

అయితే శ్రీదేవి జీవితంలో ఆమె పెళ్లి తర్వాత కెరియర్ అనూహ్యంగా మలుపు తిరిగింది.అంతేగాక ఒకానొక సమయంలో ఆమె భర్త మరియు ప్రముఖ సినీ నిర్మాత బోని కపూర్ నిర్మించినటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో తీరని నష్టాలను చవి చూశారు.

 ఈ క్రమంలో శ్రీదేవి మళ్లీ సినిమాల్లో నటించాల్సి వచ్చింది.కానీ అనుకోకుండా ఫిబ్రవరి 24వ తేదీ 2018 సంవత్సరంలో కన్నుమూసింది.

దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఏదేమైనప్పటికీ ఒకప్పుడు విశ్వసుందరిగా నిలిచి అలాగే టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్, ఇలా సినిమా పరిశ్రమతో సంబంధం లేకుండా తనకంటూ కొంత మంది అభిమానులని సంపాదించుకుని ఎంతో మంది కలల రాణి మరణించడం సినీ పరిశ్రమకి తీరని లోటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#Former Actress #TollywoodSenior #Rajasekhar #Sridevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Senior Hero Rajasekhar About His Marriage With Former Actress Sri Devi Related Telugu News,Photos/Pics,Images..