డ్రగ్స్ కేసులో ఆ తెలుగు హీరో కూతురి పేరు కూడా వినిపిస్తోందా..?

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు తీవ్రంగా కలకలం సృష్టిస్తోంది.కాగా ఇప్పటికే ఈ కేసులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోవిక్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా పలు సంచలన విషయాలను కనుగొన్నారు.

 Tollywood Senior Hero Daughter Name Is Hearing In Bollywood Drugs Case Issue Dr-TeluguStop.com

అంతేగాక ఈ మత్తు మందు పదార్థాల వినియోగం మరియు సరఫరాలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందిన మరింత మంది సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు కనుగొన్నారు.  ఇందులో ఇటీవలే రియా చక్రవర్తి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ని చెప్పడంతో ఆమె ఉన్నట్లుండి సినిమా షూటింగ్ సెట్ నుంచి వెళ్ళిపోయింది.

దీంతో ఈ మత్తుమందు పదార్థాల వినియోగం మరియు సరఫరా కేసు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ తాకింది.కాగా తాజాగా ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ హీరో మరియు నిర్మాత కూతురికి కూడా సంబంధాలు ఉన్నాయని, తొందరలోనే ఆమె పేరు కూడా బయటకు రానుందని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈమెకి రియా చక్రవర్తికి మంచి స్నేహ బంధం ఉందని అందువల్ల ఆ నిర్మాత కూతురిని కూడా పోలీసులు అనుమానిస్తున్నారని పలు కథనాలు బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో నెటిజన్లు ఆ సీనియర్ హీరో కూతురు ఎవరా.? అనే విషయంపై గూగుల్ లో తెగ వెతుకుతున్నారు.ఈ విషయం పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈమధ్య కాలంలో కొందరు నటీనటులు ఫిట్నెస్ సాధించడం కోసం మత్తు మందు పదార్థాలను వినియోగిస్తున్నారని దీంతో ఫిట్నెస్ మాట అటుంచితే అసలుకే మోసం వచ్చి కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సరిగ్గా మూడేళ్ల క్రితం టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసులో సినీ పరిశ్రమకు చెందినటువంటి హీరోలు మరియు దర్శకులు, హీరోయిన్లు ఇలా దాదాపుగా 18 మందికి పైగా అభియోగాలను ఎదుర్కొన్నారు.అయితే ఆ తర్వాత ఈ డ్రగ్స్ వ్యవహారం గురించి మళ్లీ ఇప్పుడు ప్రపంచ ప్రకంపనలు మొదలవడంతో ఎప్పుడు ఎవరు పేరు బయటకు వస్తుందని పలువురు సినీ సెలబ్రిటీస్ భయాందోళనలకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube