ఎక్కడైనా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందంటున్న సీనియర్ నటి…  

Pavitra lokesh, Tollywood senior character artist, Casting couch issue, Tollywood film industry, - Telugu Casting Couch Issue, Pavitra Lokesh, Tollywood Film Industry, Tollywood Senior Character Artist

తెలుగులో అమ్మ, అక్క, చెల్లి, వదిన, తదితర పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే పవిత్ర లోకేష్ స్వతహాగా కన్నడ సినీ పరిశ్రమ కి చెందినప్పటికీ ఆమె తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - Tollywood Senior Character Artist Pavitra Lokesh React About Casting Couch Issue

అయితే తాజాగా పవిత్ర లోకేష్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇందులో భాగంగా సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి స్పందించింది.

కాగా ఇందులో క్యాస్టింగ్ సమస్య అనేది ఒక సినిమా పరిశ్రమలోనే గాక ఇతర రంగాల్లో కూడా ఉంటుందని కాకపోతే అలాంటి సమస్యలు మనం ఎదుర్కొనే సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ముఖ్యమని తెలిపింది.

TeluguStop.com - ఎక్కడైనా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందంటున్న సీనియర్ నటి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో కొందరు అవకాశాల కోసం సర్దుకు పోతుంటే మరికొందరు మాత్రం నిర్మొహమాటంగా దర్శక నిర్మాతలు అడిగిన కమిట్మెంట్ కి నో చెబుతున్నారని, ఇలా చేయడం వల్ల వారు కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే కోల్పోతారని భవిష్యత్తులో మాత్రం మళ్లీ ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తే చాకచక్యంగా తప్పించుకుంటారని తెలిపింది. అయితే తాను మాత్రం ఎప్పుడూ సినిమా పరిశ్రమలో ఎలాంటి లైంగిక వేధింపులకు గురి కాలేదని స్పష్టం చేసింది.

ఒకవేళ తనకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురైతే నిర్మొహమాటంగా నో చెబుతానని కూడా తెలిపింది.

సినిమా పరిశ్రమలో ఎవరో కొంతమంది వ్యక్తులు చేసే పనుల కారణంగా అందరిని నిందించడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

 ఇందుకు ఉదాహరణగా తన నటనా ప్రతిభను గుర్తించినటువంటి కొందరు దర్శక నిర్మాతలు తనకు సూటయ్యేటువంటి పాత్రలను తనకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారని అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని తెలిపింది.

#Pavitra Lokesh #CastingCouch #TollywoodSenior #TollywoodFilm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Senior Character Artist Pavitra Lokesh React About Casting Couch Issue Related Telugu News,Photos/Pics,Images..