సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మృతి

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు బోస్ ఈ రోజు గాంధీ హాస్పిటల్ లో మరణించాడు.పూరి జగన్నాథ్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో ఆయన ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్‌ చేస్తున్నాడు గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

 Tollywood Senior Artist Bose Died In Hyderabad-TeluguStop.com

అనారోగ్యంతో ఉన్న అతను నాలుగు తన ఇంట్లో కాలు జారి పడటంతో తలకి బలమైన గాయం అయ్యిందని.కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది.

అయితే ఇన్ని రోజులు చికిత్స పొందిన బోస్ ఈ రోజు తుదిశ్వాస విడిచాడు.ఆయన మృతికి పలువురు దర్శకుడు, నటులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

మూడు దశాబ్ధలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బోస్‌, ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు.సుమన్‌ హీరోగా తెరకెక్కిన సాహసపుత్రుడు సినిమాతో తెరకు పరిచయం అయిన బోస్‌కు ప్రేమఖైదీ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube