హీరోయిన్లుగా సినిమా పరిశ్రమను ఓ ఊపు ఊపిన హీరోయిన్లు పలు కారణాలతో వెండి తెరకు దూరం అయిన సందర్భాలున్నాయి.మళ్లీ కొంత కాలం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం కామన్ గా మారింది.
తాజాగా తెలుగులో ఈ ట్రెండ్ జోరందుకుంది.వెండి తెరకు దూరమైన నటీమణులు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని బిజీ అవుతున్నారు.
పలువురు దర్శక నిర్మాతలు ఏరి కోరి మరి హీరోయిన్ గా రిటైర్ అయిన కొంతమంది కథానాయికలను తీసుకువచ్చి మరి తమ సినిమాల్లో కీరోల్స్ చేయిస్తున్నారు.వారికి మంచి గౌరవంతో పాటు రెమ్యునరేషన్ కూడా అందుతుంది.
అటు చాలామంది పాత తరం హీరోయిన్ లు రీఎంట్రీ ఇస్తుండటంతో ఇక్కడ కూడా పోటీ బాగా పెరిగిపోయింది.ఈ కారణంగానే కొంత మంది సీనియర్ నటీమణులు మళ్లీ నిలదొక్కు కోవడం కాస్త ఇబ్బంది అవుతుంది.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సితార
మొదటి నుంచి కూడా సంప్రదాయ బద్దమైన పాత్రల్లో నటించేంది సితార.లెజెండ్ సినిమా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు.అలా వరుసగా ఆమె యంగ్ స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేస్తూ వచ్చారు.
ఆది సాయి, కుమార్ జోడి సినిమా తర్వాత మాత్రం ఆమె ఎక్కడా కనిపించడం లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 6 ఏళ్ళ పాటు కొనసాగిన తర్వాత ఆమెకు అవకాశాలు కాస్త పలచబడి నట్లు గా అనిపిస్తోంది.
నిరోషా
హాట్ హీరోయిన్ గా తన మత్తు కళ్ళతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది నిరోషా.క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన జోరు మాత్రం చూపించలేకపోయింది.ఒకటి రెండు సినిమాల తర్వాత ఆమె కనిపించకుండా పోయారు.
ఐశ్వర్య, గౌతమి
ఇక ఐశ్వర్య, గౌతమి పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది.మామగారు, బ్రహ్మ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య అడపాదడపా మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ వస్తున్నారు.దేవదాసు, ఓ బేబీ తర్వాత ఆమె తెరమరగవుతూ వచ్చారు.
క్యూట్ హీరోయిన్ గా ఒకప్పుడు మంచి మార్కులు కొట్టేసిన గౌతమి.మనసంతా సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు.
తన గ్లామర్ ఎంత మాత్రం తగ్గలేదని అనిపించుకున్నారు.డీసెంట్ గా కనిపించే పాత్రలలో బిజీ అవుతారని అభిమానులు అనుకున్నారు.
కానీ ఆమె కూడా ఆ సినిమా తర్వాత తెరపై కనిపించడం లేదు.