అలాంటి పాత్రలు చేస్తే డబ్బులు ఎక్కువ ఇస్తామన్నారు... కానీ  

Tollywood Senior Actress Tulasi Interesting News - Telugu Actress Tulasi Interesting News, Senior Actress Tulasi, Senior Actress Tulasi Interesting News,, Tulasi Interesting, Tulasi Interesting News

తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల చిత్రాల్లో తల్లి పాత్రలో నటించినటువంటి సీనియర్ నటి తులసి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈమె ఒక తెలుగులోనే కాక తమిళం, కన్నడలో కూడా తనకంటూ కొద్ది మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.

 Tollywood Senior Actress Tulasi Interesting News

తాజాగా నటి తులసి ప్రముఖ కమెడియన్ మరియు హీరో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అటువంటి ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా ఆసక్తికర విషయాలను తన అభిమానులతో పంచుకుంది.

తాను పుట్టింది పెరిగింది చెన్నైలోనే నని కానీ తన తల్లి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన మహిళని చెప్పుకొచ్చింది.అయితే తన తల్లి కోరిక మేరకే సినిమాల్లోకి వచ్చానని ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించానని తెలిపారు.

అలాంటి పాత్రలు చేస్తే డబ్బులు ఎక్కువ ఇస్తామన్నారు… కానీ-Latest News-Telugu Tollywood Photo Image

అయితే మొదట్లో కొందరు దర్శకులు తనని స్కిన్ షో చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ పారితోషకం ఉంటుందని మరియు అలాంటి పాత్రలు కూడా ఆఫర్ చేశారని చెప్పుకొచ్చింది.అయితే తనకు ఇష్టం లేకపోవడంతో అలాంటి స్కిన్ షో చేసేటువంటి పాత్రలు చేయనని తెగేసి చెప్పేసిందట.

దీనివల్ల పలు అవకాశాలు కూడా కోల్పోయానని చెప్పుకొచ్చింది.కానీ అప్పుడు అలాంటి పాత్రలు చేయకపోవడం ఇప్పుడు తన సిని జీవితానికి మంచిదయ్యిందని అభిప్రాయపడింది.

అయితే తన భర్త విషయంలో కూడా ఓ క్లారిటీ ఇచ్చింది.ఎందుకంటే దాదాపుగా తన భర్త శివమణి పేరుతో ఫేమస్ డ్రమ్స్ మాస్టర్ శివమణి ఉండడంతో అందరూ కూడా అతడినే తన భర్త అనుకుంటున్నారని కానీ తన భర్త డైరెక్టర్ శివమణి అని సరదాగా చెప్పుకొచ్చారు.తన చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మగపిల్లాడి పాత్రలో దాదాపుగా వంద చిత్రాల్లో నటించానని కూడా చెప్పుకొచ్చారు.అంతేగాక జీవితంలో ఎదగాలంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా క్రమశిక్షణతో మనం చేసేటువంటి పని మీద దృష్టి పెట్టి ముందుకు వెళితే ప్రతి ఒక్కరు కచ్చితంగా సక్సెస్ అవుతారని సూచించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Senior Actress Tulasi,senior Actress Tulasi Interesting News,tollywood Senior Actress Tulasi Interesting News,tulasi Interesting,tulasi Interesting News- Related....