సంక్రాతి 2022... ఇంత కంటే దారుణం ఉండదేమో

Tollywood Sankranthi Special

టాలీవుడ్‌ ప్రేక్షకులు ప్రతి సంక్రాంతికి కూడా వినోదాల వింధు ను ఎంజాయ్ చేయడం చాలా కామన్‌ విషయం.ప్రతి పండగకు ఏమో కాని సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా సినిమాకు వెళ్లాలని అనుకునే వారు చాలా మంది ఉంటారు.

 Tollywood Sankranthi Special-TeluguStop.com

పెద్ద ఎత్తున సంక్రాంతి సినిమాలు విడుదల అయినా కూడా పెద్ద ఎత్తున వసూళ్లు నమోదు అవ్వడం జరుగుతూన ఉంటుంది.తాజాగా సంక్రాంతికి విడుదల అయిన సినిమాల విషయానికి వస్తే ప్రేక్షకులకు నిరాశ తప్పడం లేదు.

ఒక్క బంగార్రాజు మినహా మరే సినిమా కూడా విడుదల కాలేదు.బంగార్రాజు సినిమా తో పాటు చిన్న చితక సినిమాలు కొత్త హీరోల సినిమాలు వచ్చాయి కాని వాటిని పట్టించుకోవాలనే ఆసక్తి కూడా ప్రేక్షకులకు లేదు.

 Tollywood Sankranthi Special-సంక్రాతి 2022… ఇంత కంటే దారుణం ఉండదేమో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బంగార్రాజు సినిమా భారీ వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో ఇతర సినిమాలు కూడా వచ్చి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు దక్కించుకునేవి అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bangarraju, Tollywood, Radheshyam-Movie

ఆర్ ఆర్ ఆర్‌ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరిపి కరోనా వల్ల వాయిదా వేశారు.రాధే శ్యామ్‌ పరిస్థితి కూడా అంతే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా లు సంక్రాంతికి విడుదల అయ్యి ఉంటే పదిహేను వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమా లకు సంబంధించి చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నే వసూళ్ల లెక్కలు పెరిగాయి. ఈ సంక్రాంతికి అంత పెద్ద సినిమాలు రెండు వస్తానంటూ రాకపోవడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు.

ఇంత కంటే దారుణం మరోటి ఉండక పోవచ్చు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాలు కాకుండా చిన్నా చితకా సినిమా లను చూడాల్సి వచ్చిందే అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

ఆ సినిమా లు కనీసం సంక్రాంతికి అయినా వచ్చేనా అనేది చూడాలి.

#Radheshyam #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube