అవకాశాల్లేక వెబ్ సీరీస్ వైపు చూస్తున్న బోల్డ్ హీరోయిన్…  

Payal Rajput, tollywood heroine , Rx 100 movie, tollywood, web series, - Telugu Payal Rajput, Rx 100 Movie, Tollywood, Tollywood Heroine, Web Series

తెలుగులో ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన  “ఆర్ఎక్స్ 100” చిత్రంలో తన హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతాగానో అలరించినటువంటి పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను బాగా అలరించినప్పటికీ తన తదుపరి చిత్రాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

 Tollywood Rx 100 Movie Fame Payal Rajput Web Series

దీంతో ఈ  అమ్మడు ఇప్పటికీ హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అవకాశాల్లేక వెబ్ సీరీస్ వైపు చూస్తున్న బోల్డ్ హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో అందాల విందు చేసేందుకు పాయల్ రాజ్ పుత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అంతేగాక ఈ అమ్మడు ఇప్పటివరకు నటించినటువంటి చిత్రాలలో దాదాపుగా గ్లామర్ పాత్రలే పోషించింది.

అందువల్లనే వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కించుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు పాయల్ రాజ్ పుత్ మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు నటించిన వెంకీ మామ చిత్రం మంచి హిట్ అయినప్పటికీ ఈ అమ్మడుకి ఆ సంతోషం ఎంతోకాలం లేదు.వెంటనే టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “డిస్కో రాజా” చిత్రంతో పరాజయం వెంటాడింది.

ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో కొత్తగా సినీ అవకాశాలు లేవు.కాగా తమిళంలో ఏంజెల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ కోలీవుడ్ కి పరిచయమవుతోంది.

#Rx 100 Movie #Payal Rajput #Web Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Rx 100 Movie Fame Payal Rajput Web Series Related Telugu News,Photos/Pics,Images..