కొరటాలతో మూవీ ప్లాన్ చేసుకున్న ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా మీద ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 Ntr Green Signal To Koratala After Trivikram Movie, Tollywood, Rrr Movie, Telugu-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తారక్ మరో స్టార్ దర్శకుడుని ఇప్పటికే లైన్ లో పెట్టినట్లు సమాచారం.

త్రివిక్రమ్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడని సమాచారం.ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో జనతా గ్యారేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ దర్శకులలో ఒకడుగా కొరటాల శివ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.మంచి సామాజిక ఎలిమెంట్ ని తీసుకొని దానికి కమర్షియల్ అంశాలు జోడించి సినిమాలు తీస్తూ వరుస హిట్స్ కొడుతున్న కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు.

ఆచార్య టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయిపోయే టైంకి తారక్ త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం ఉంది.

దాంతో త్రివిక్రమ్ సినిమా ఫినిష్ కాగానే కొరటాల సినిమాని సెట్స్ పైకి ఎన్టీఆర్ తీసుకెళ్లబోతున్నట్లు టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube