పాపం… అప్పట్లో విజయ్ దేవరకొండతో నటించడానికి ఆ హీరోయిన్లు నో చెప్పారంట…  

Tollywood Rowdy Vijay Devarakonda Heroine Video Goes Viral In Social Media - Telugu Geetha Govindam, Rashmika Mandanna, Tollywood, Tollywood Hero, Viajy Devarakonda

తెలుగులో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించినటువంటి పెళ్లి చూపులు అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఇతడు పెళ్లి చూపులు చిత్రంలో నటించక ముందే పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపు తీసుకు రాలేకపోయాయి.

 Tollywood Rowdy Vijay Devarakonda Heroine Video Goes Viral In Social Media

దీంతో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంతో మంచి హిట్ అందుకోవడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది.

కాగా ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ కి సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

పాపం… అప్పట్లో విజయ్ దేవరకొండతో నటించడానికి ఆ హీరోయిన్లు నో చెప్పారంట…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే గతంలో విజయ్ దేవరకొండ తాను హీరోగా నటిస్తున్న టువంటి చిత్రంలో హీరోయిన్ కోసమై దర్శక నిర్మాతలు పలువురు స్టార్ హీరోయిన్ల ను సంప్రదించడంతో వారు విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ గా నటించేందుకు పెద్దగా ఇష్ట పడలేదట. దాంతో హీరోయిన్ దొరక్క కొంతకాలం పాటు విజయ్ దేవరకొండ తన చిత్రాన్ని వాయిదా కూడా వేసుకోవాల్సి వచ్చిందట.

దాంతో ఈ వీడియోని పలువురు విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేకాక ఇలాంటి హీరోయిన్ కష్టాలను ప్రతి హీరో కూడా తమ సినీ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొని ఉంటాడని తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఫైటర్ అనే  చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది.

కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి కౌర్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నివేశాలు ముంబై నగర పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Rowdy Vijay Devarakonda Heroine Video Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..

footer-test