సంచలనంగా మారిన పృధ్వీ రాసలీలల వ్యవహారం! విచారణ తర్వాత చర్యలు  

Prudhvi Issue Controversy In Ttd And Ap Politics-ap Politics,prudhvi Issue Controversy,ttd,ysrcp

ఓ వైపు అమరావతి రాజధాని ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తూ ఉండగా, మరో వైపు ఈ రోజు భక్తి చానల్ చైర్మన్ 30 ఇయర్స్ పృధ్వీ రాసలీలల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది.మొత్తం మీడియా చానల్స్ అన్ని కూడా ఈ విషయాన్నే ఈ రోజు హైలెట్ చేస్తున్నాయి.

Prudhvi Issue Controversy In Ttd And Ap Politics-ap Politics,prudhvi Issue Controversy,ttd,ysrcp తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నా-Prudhvi Issue Controversy In TTD And AP Politics-Ap Politics Prudhvi Ttd Ysrcp

ఓ మహిళా ఉద్యోగితో శృంగార సంభాషణ ఇప్పుడు పృధ్వీ ఇమేజ్ ని డామేజ్ చేసింది.ఆ వీడియో టేపులు బయటకి వచ్చిన తర్వాత రాజధాని మహిళా రైతుల నుంచి మహిళా సంఘాల వరకు అందరూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అతను అసలు భక్తి చానల్ చైర్మన్ గా ఉండటానికి అర్హుడు కాదని, వెంటనే అతనిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం మీద పృధ్వీ వెర్షన్ వేరోలా ఉంది.

అసలు తాను ఎలాంటి వాడినో అక్కడి ఉద్యోగులని అడిగితే తెలుస్తుందని చెబుతున్నాడు.ఎవరో తన వాయిస్ ని మిమిక్రీ చేసి ఇలా తన ఇమేజ్ దెబ్బ తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై తాను ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికి అయిన సిద్ధం అని అంటున్నాడు.

దీనిపై టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు.పృద్వీపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరుపుతామని, అవి వాస్తవం అని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అయితే ఈ వ్యవహారాన్ని అధికార పార్టీ నీరు గార్చే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.మరి ఈ రోజు సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి

తాజా వార్తలు