యూఎస్‌లో టాలీవుడ్‌ వ్యభిచారం.. అసలు విషయం ఇది       2018-06-14   22:22:22  IST  Raghu V

సినీ తారలు అప్పుడప్పుడు సెక్స్‌ రాకెట్‌లో పట్టుబడటం చూస్తూనే ఉంటాం. హైదరాబాద్‌, బెంగళూరు, వైజాగ్‌ ఇలా ప్రముఖ పట్టణాల్లో తెలుగు సినిమా తారలు అరుదుగా పట్టుబడ్డారు. అయితే ఈసారి అమెరికాలో తెలుగు తారలు సెక్స్‌ రాకెట్‌ను నడుపుతున్నట్లుగా వెళ్లడైంది. చాలా ఖరీదైన వ్యవహారంగా సాగుతున్న ఈ సెక్స్‌రాకెట్‌ విషయం ఏప్రిల్‌లోనే అమెరికా పోలీసుల దృష్టికి వచ్చిందట, అప్పటి నుండి విచారణ చేపట్టి తాజాగా కోర్టుకు అసలు విషయాలను పోలీసులు సమర్పించారు. తెలుగు నిర్మాత అయిన కిషన్‌ మరియు ఆయన భార్య చంద్రలు ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా తేలిపోయింది.

అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చిందంటే.. క్రిస్మస్‌ సందర్బంగా అమెరికాలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లుగా కిషన్‌ మరియు చంద్రలు తెలుగు సినిమాల్లో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా వెలుగులోకి వస్తున్న హీరోయిన్‌ను రప్పించారు. ఆమెకు భారీ మొత్తంలో ఆశ చూపించి అమెరికాకు సింగిల్‌గా వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఆమెను ఒక ఖరీదైన హోటల్‌లో ఉంచి వ్యభిచారం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. అమెరికా నుండి బయట పడాలి అంటే తాము చెప్పినట్లుగా చేయాల్సిందే అంటూ ఒత్తిడి చేశారు. దాంతో ఆ నటి ఒక ఈమెయిల్‌ ద్వారా వారికి తన వల్ల ఇలాంటివి కావని, దయచేసి నన్ను వెళ్లనివ్వడం అంటూ పేర్కొంది. ఆమెయిల్‌ కాస్త అమెరికన్‌ పోలీసులకు చిక్కింది.

తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా ఆ మెయిల్‌ ద్వారా తెలిసిన విషయాన్ని కిషన్‌ మరియు చంద్రల వద్ద నిర్థారించుకునే ప్రయత్నం చేయడంతో పాటు, వారి ఇంటిని, వారి మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ను సోదాలు చేయగా అసలు విషయం తెలిసి పోయింది. వీరిద్దరు గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారిని అమెరికాకు రప్పించి, అమెరికాలో ఉన్న తెలుగు వారికి వలగా వేస్తున్నారు. కేవలం రెండు గంటలకు ఏకంగా మూడు వేల డాలర్ల వరకు వీరు వసూళ్లు చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చిన విటులు మూడు వేల డార్లతో పాటు, ఆ సెలబ్రెటీకి కూడా కొంత మొత్తంలో డబ్బు ఇస్తారని తెలుస్తోంది.

మొత్తానికి చాలా ప్లాన్డ్‌గా, హైటెక్‌ వ్యభిచారం రేంజ్‌లో జరిగిన ఈ విషయం గుట్టు రట్టు అవ్వడంతో కిషన్‌ మరియు చంద్రలు అమెరికా జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. ఇంతకు ఈమెయిల్‌ పంపించిన ఆ హీరోయిన్‌ ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా ఉంది. ఎంతో మందిని కిషన్‌ బెదిరించాడు అంటూ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కిషన్‌ బారిన పడిన వారు ఎవరు అనే విషయం బయటకు పొక్కడం లేదు. కనీసం ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చినా కూడా అమెరికాలో ఉండి పైకి గౌరవంగా బతికేస్తున్న వారి పరువు పోవడం ఖాయం. ఇలాంటి పనులు చేస్తే ఎప్పటికైనా బయట పడుతుందని, ఆ విషయం తెలిసి కూడా కిషన్‌ ఎంత ధైర్యంగా ఇలాంటివి చేశాడు అంటూ సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.