కరోనా పుణ్యమా అని తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది.దాదాపు అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి.
విడుదలలు ఆగిపోయాయి.కరోనా అదుపులోకి వస్తే తప్ప మళ్లీ సినిమా పరిశ్రమ గాడినపడే అవకాశం కనిపించడం లేదు.
అయితే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి.అయితే ఏ సినిమా ఎంతమేరకు షూటింగ్ పూర్తయ్యింది.
ఇంకా ఎంత పెండింగ్ లో ఉంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న తాజా ప్రాజెక్టు ఆచార్య.
నిజానికి ఈ సినిమా గతేడాది 13న విడుదల కావాల్సి ఉంది.అయితే కరోనా ససెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
ఈ సినిమా ఇంకా 10 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉన్నది.అటు బాలయ్య- బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా అఖండ.
ఈ సినిమా షూటింగ్ ఇంకా నెల రోజుల పాటు పెండింగ్ ఉంది.అటు ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ సైతం పెండింగ్ లోనే పడిపపోయింది.
ఇంకా 10 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ కొనసాగాల్సి ఉంది.అటు టీ సిరీస్ కోసం ప్రభాస్, పూజా హెగ్డేపై ఓ పాటను షూట్ చేయనున్నారు.
అలాగే కొన్ని కొన్ని ఫ్యాచ్ వర్స్క్ కూడా కొనసాగనున్నాయి.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నిజానికి అక్టోబర్ 13న విడుదల కావాల్సి ఉంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా నెల రోజుల పాటు షూటింగ్ కొనసాగే అవకాశం ఉంది.అటు నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ సైతం 10 రోజుల పెండింగ్ ఉంది.హైదాబాద్ లో కోల్ కతా సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు.
అటు బన్నీ-సుకుమార్ మూవీ పుష్ప షూటింగ్ ఇంకా 10 రోజుల పాటు కొనసాగనుంది.
ఈ తొలిపార్టులో మిగిలిపోయిన ప్యాచ్ వర్క్స్ తో పాటు మిగతా సినిమా షూటింగ్ కొనసాగనుంది.ఆ తర్వాత మరో భాగం సినిమా రూపొందించనున్నారు.అటటు మహేష్ బాబు-పరుశురాం కాంబోలో వస్తున్న సర్కారు వారి పాట సినిమా 80 శాతం షూటింగ్ పెండింగ్ లో ఉంది.అటు నాగార్జున – ప్రవీణ్ సత్తారు మూవీ మేజర్ షెడ్యూల్స్ పెండింగ్ లోనే ఉన్నాయి.
నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ మూవీ థాంక్యూ షూటింగ్ ఇంకా 50 శాతం పెడింగ్ పడింది.అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ షూటింగ్ ఇంకా వారం రోజులు పట్టే అవకాశం ఉంది.