8 వారాల నిబంధన మర్చిపోయిన టాలీవుడ్ నిర్మాతలు.. వాళ్లకు పండగే!

టాలీవుడ్ నిర్మాతలు కొన్ని నెలల క్రితం థియేటర్ రిలీజ్ అయిన సినిమాలు ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వాలంటూ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే.ఈ నిర్ణయం తీసుకునే ఎప్పటికీ షూటింగ్ దశలో ఉన్న సినిమా లు మరియు అప్పటికే కమిట్ అయిన సినిమా లకు మాత్రం ఈ 8 వారాల కండిషన్ వర్తించదని, ఇక ముందు ప్రారంభం కాబోతున్న సినిమాలన్నింటి కూడా ముందస్తుగా ఓటీటీ భాగస్వామి ని ప్రకటించకుండా ఉండాలని.

 Tollywood Producers Who Ignore The 8 Week Condition, Tollywood  , Producers ,wal-TeluguStop.com

అలాగే థియేటర్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని కఠినంగా కండిషన్ పెట్టడం జరిగింది, కానీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయం లో కొందరు నిర్మాతలు నిర్మాతలు మండలి యొక్క నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు.

Telugu Hunt, Ott, Sudheer Babu, Telugu, Telugu Ott, Tollywood-Movie

ఇటీవల సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమా థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సినిమా కు ప్రేక్షకుల నుండి థియేటర్ల ద్వారా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కలేదు.దాంతో వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్‌ కి మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ వారంలోనే ఈ సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందింది.

Telugu Hunt, Ott, Sudheer Babu, Telugu, Telugu Ott, Tollywood-Movie

ఆ ఒక్క సినిమా మాత్రమే కాకుండా ఇంకా పలు సినిమా లు కూడా 8 వారాల నిబంధనను పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మొన్న సంక్రాంతి కి విడుదలైన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమాలు 8 వారాల నిబంధన పాటించి ఆలస్యంగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతాయా లేదంటే ముందే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతాయా అనేది చూడాలి.ముందు ముందు అయినా ఈ 8 వారాల నిబంధన ను కఠినం గా అమలు చేస్తే థియేటర్ల ను రక్షించుకున్న వాళ్ళం అవుతాం అంటూ కొందరు చిన్న నిర్మాతలు మరియు థియేటర్ల యాజమాన్యాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube