ఆ పనికి మళ్లీ పవన్‌ పేరును వాడేయబోతున్నారట

మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది.పవన్‌ కళ్యాణ్‌ కింగ్‌ లేదా కింగ్‌ మేకర్‌ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.

 Tollywood Producers Use In Pawan Kalyan Name-TeluguStop.com

కాని ఫలితం బెడిసి కొట్టింది.పవన్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోవడంతో పాటు పార్టీ నుండి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యాడు.

ఈ నేపథ్యంలో పవన్‌ మళ్లీ సినిమాలు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటూనే పవన్‌ సినిమాలు చేస్తాడని తెలుస్తోంది.

Telugu Pawan Kalayan, Pawan Kalyan, Pawankalyan-

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు ఇప్పటికే చర్చల్లో ఉన్నాయి.పింక్‌ రీమేక్‌తో పాటు క్రిష్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.ఈ రెండు సినిమాలు 2020 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా పవన్‌ సినిమాలు చేస్తాడని సమాచారం అందుతోంది.

పవన్‌ గతంలో పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్‌ పేరుతో ఒక బ్యానర్‌ను ప్రారంభించాడు.ఆ బ్యానర్‌లో సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.

Telugu Pawan Kalayan, Pawan Kalyan, Pawankalyan-

పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో సినిమా అంటే ఆయన డబ్బులు పెట్టకుండానే కేవలం మాట మరియు పేరుతోనే నిర్మాతగా మారబోతున్నాడు.పవన్‌ కళ్యాణ్‌ బ్యానర్‌లో సినిమా అంటే ఆ సినిమాకు మంచి క్రేజ్‌ ఉంటుంది.అందుకే నిర్మాతలు పవన్‌ కళ్యాణ్‌ పేరుపై సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అంటే పవన్‌ పేరు వాడి సినిమాకు పబ్లిసిటీ దక్కించుకోవడం అన్నమాట.పవన్‌ ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు మళ్లీ సినిమాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube