టాలీవుడ్ బడా నిర్మాతలు ఎందుకు ఆ ఆలోచన చేయడం లేదు?

అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని అద్బుతాలను ఆవిష్కరిస్తున్నారు.సినిమా పరిశ్రమలో కూడా సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది.

 Tollywood Producers Not Following Pay Per View Platform For Releasing Movies, To-TeluguStop.com

బడా నిర్మాతలు ఎంతో మంది భారీ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా లను నిర్మిస్తున్నారు.సినిమా నిర్మాణం లో సాంకేతిక పరిజ్ఞనంను ఉపయోగించడం మొదటి నుండి కొనసాగుతూ వస్తుంది.

కాని టాలీవుడ్‌ నిర్మాతలు మాత్రం బాలీవుడ్ నిర్మాతల మాదిరిగా అడ్వాన్స్ గా ఆలోచించడం లో కాస్త వెనుక ఉంటున్నారు.ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి మరియు ఇక్కడి వారి పరిస్థితి అంటూ బాలీవుడ్‌ నిర్మాతలు అనుసరించిన విధానాలను తెలుగు నిర్మాతలు అనసరించకుండా మూస పద్దతిలోనే కొనసాగుతూ వస్తున్నారు.

తెలుగు నిర్మాతలు ఈమద్య కాలంలో ఓటీటీ వైపు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు కాని పూర్తి స్థాయిలో మాత్రం సినిమా బడా నిర్మాతలు ఓటీటీ లోకి అడుగు పెట్టే ఉద్దేశ్యం లో లేరు.

ఇటీవల బాలీవుడ్ మూవీ రాధే ను థియేటర్ల తో పాటు ఓటీటీ లో కూడా విడుదల చేయడం జరిగింది.

సల్మాన్ ఖాన్‌ కు ఉన్న క్రేజ్ నేపథ్యం లో పే పర్‌ వ్యూ లో రాధే సినిమా మొదటి రోజే ఏకంగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకుంది.రాధే సినిమా వసూళ్ల విషయంలో రికార్డును నెలకొల్పింది.

టాలీవుడ్‌ సినిమా నిర్మాతలు కూడా ఈ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు అంటున్నారు.ప్రస్తుతం పలు సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

కాని ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా లేరు.రాధే తరహాలో టాలీవుడ్‌ పెద్ద హీరోల సినిమా లు కూడా ఎందుకు విడుదల చేయలేక పోతున్నారు అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే మరి కొందరు మాత్రం టాలీవుడ్‌ ప్రేక్షకులు ఇప్పుడే పే పర్‌ వ్యూ పద్దతిలో చూసే అవకాశం తక్కువ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మొత్తానికి టాలీవుడ్‌ నిర్మాతలు పే పర్ వ్యూ పద్దతిని పాటిస్తే బాగుంటుంది అనేది మెజార్టీ జనాల అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube