అవార్డు తిరస్కరించిన జయసుధ..పగ తీర్చుకున్న నిర్మాత !

ముత్యాల సుబ్బ‌య్య‌.అప్పుడ‌ప్పుడే ఈ కుర్ర డైరెక్ట‌ర్ కాస్తా టాప్ డైరెక్ట‌ర్ గా ఎదుగుతున్న రోజుల‌వి.వ‌రుస హిట్స్ తో ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపాడు.ఒకే ఏడాదిలో ఎర్రమందారం, మామగారు, కలికాలం సినిమాల‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.ఈ దెబ్బ‌తో ముత్యాల సుబ్బ‌య్య గీత మారిపోయింది.అటు ఎర్ర‌మందారం, క‌లికాలం సినిమాకు 1990లోనే సెన్సార్ పూర్త‌య్యింది.

 Tollywood Producer Revenge On Jayasudha, Tollywood , M.s Reddy , Jayasuda , Nand-TeluguStop.com

దీంతో ఆ రెండు సినిమాలు 1990 నంది అవార్డుల కోసం బ‌రిలో నిలిచాయి.

అటు కళాసాగర్ అనే అప్పటి ప్రముఖ కళాకారుల సంస్థ ప్రతి ఏటా సినిమా అవార్డులు ఇచ్చేది.

వాటిని చాలా గౌర‌వంగా భావించే వారు న‌టీన‌టులు.అందుకు తగ్గట్టుగానే ప్రతిభా వంతుల్ని గుర్తించి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించే వారు ఆ సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డి.

సహజంగా ఎమ్మెస్ రెడ్డికి కాస్త కోపం ఎక్కువ.ఆయన ఇచ్చే అవార్డు తీసుకోవడానికి ఎవరైనా రాకపోతే ఆయన అది మనసులో పెట్టుకుని వారిని తన సినిమాల్లో మళ్ళీ పెట్టుకునే వారు కాదు.

అందుకే ప్రతి నటి, నటుడు ఎమ్మెస్ రెడ్డి ఇచ్చే అవార్డులను తీసుకునేవారు.

Telugu Jayasuda, Jayasudha, Kalikalm, Reddy, Nandhi Awards, Tollywood-Telugu Sto

ఐయితే కలికాలం సినిమాలో జయసుధ కథానాయికగా నటించింది.ఆమెకు ఉత్తమ నటిగా కాకుండా ఉత్తమ సహాయ నటిగా ఎమ్మెస్ రెడ్డి అవార్డు ఇచ్చారు.కానీ ఆ అవార్డు తీసుకోవడానికి జయసుధ వెళ్లలేదు.కలికాలంలో నేను హీరోయిన్‌ గా నటిస్తే, సపోర్టింగ్ న‌టి అవార్డ్‌ ఇవ్వడం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు.ఆయన త‌న‌ను అవమాన పరచడానికే అలా అవార్డు ప్రకటించారు.అలాంటి అవార్డు నాకు అక్కర్లేదు అంటూ జయసుధ అవార్డును తిరస్కరించింది.

దాంతో ఎమ్మెస్‌ రెడ్డికి కోపం కట్టలు తెచ్చుకుంది.నా అవార్డునే జయసుధ తిరస్కరించి తప్పుపడుతుందా? అంటూ ఆయన ఆగ్రహించారు.ఆ కోపాన్ని ఆయన 1990 నంది అవార్డుల కమిటీకి ఛైర్మన్‌ అయిన తరువాత తీర్చుకున్నారు.కేవలం జయసుధ మీద కోపంతో కలికాలం సినిమాను చూడకుండా పక్కన పెట్టేస ఆ సినిమాకి ఎలాంటి అవార్డు రాకుండా తన పలుకుబడిని ఉపయోగించాడ‌ట.

మొత్తానికి ఎమ్మెస్ రెడ్డి కోపానికి ఒక మంచి సినిమాకి ఎలాంటి అవార్డు రాలేదు.అయినా జయసుధ మీద కోపంతో సినిమాకి అన్యాయం చేయడం దారుణం అని చాలా మంది సినీ జ‌నాలు అభిప్రాయ‌ప‌డ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube