ఆర్.కే నాయుడు కోసం దిల్ రాజు మొదటి సారి అలాంటి నిర్ణయం తీసుకున్నాడట...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జెమినీ టీవీలో ప్రసారమయ్యే చక్రవాకం, మొగలి రేకులు ధారావాహికలలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్.కే నాయుడు అలియాస్ సాగర్ గురించి బుల్లితెర మరియు వెండితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Tollywood Producer Dil Raju About Shaadi Mubarak Movie-TeluguStop.com

కాగా ప్రస్తుతం సాగర్ తెలుగులో “షాదీ ముబారక్” అనే చిత్రంలో హీరోగా నటించాడు.ఈ చిత్రానికి నూతన దర్శకుడు పద్మశ్రీ దర్శకత్వం వహించగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు.

కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలయింది.

 Tollywood Producer Dil Raju About Shaadi Mubarak Movie-ఆర్.కే నాయుడు కోసం దిల్ రాజు మొదటి సారి అలాంటి నిర్ణయం తీసుకున్నాడట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మామూలుగా తాను అనుకున్న స్క్రిప్ట్ లకి మాత్రమే ఫైనాన్స్ చేసి నిర్మాతగా వ్యవహరిస్తానని కానీ ఈ చిత్ర ట్రైలర్ ని చూసిన తర్వాత మళ్లీ ఫైనాన్స్ చేసేందుకు అంగీకరించానని తెలిపాడు.అయితే ఈ చిత్రం గత ఏడాది విడుదల కావాల్సి ఉందని కానీ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని తెలిపాడు.

Telugu Dil Raju, Sagar, Shaadi Mubarak, Shaadi Mubarak Movie Public Talk, Shaadi Mubarak Movie Review, Telugu Movie Producer, Tollywood, Tollywood Producer Dil Raju About Shaadi Mubarak Movie-Movie

అలాగే తాను ఇతరులు నిర్మాతలుగా వ్యవహరించిన చిత్రానికి మధ్యలో ఫైనాన్స్ చేయడం ఇదే మొదటి సారని అంతగా ఈ చిత్ర యూనిట్ సభ్యుల పనితీరు మరియు ఈ చిత్రంపై నమ్మకం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.అంతేకాక ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని కూడా ధీమా వ్యక్తం చేశాడు.అలాగే ప్రతి ఒక్కరూ థియేటర్లకి వెళ్లి సినిమా చూడాలని పైరసీని ప్రోత్సహించద్దని సూచించాడు.

అయితే ఇప్పటికే ఆర్.

కే నాయుడు కి బుల్లితెర ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ఉన్నందున ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.దీంతో గతంలో భాగంగా సిద్ధార్థ మరియు మిస్ మ్యాచ్ అనే చిత్రాలతో ప్రేక్షకులను బాగానే అలరించాడు.

దీంతో షాదీ ముబారక్ చిత్రంతో హిట్ కొట్టాలని సరికొత్త కథనంతో ముందుకు వచ్చాడు. మరి ప్రేక్షకులు షాదీ ముబారక్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

#Shaadi Mubarak #ShaadiMubarak #TeluguMovie #Sagar #ShaadiMubarak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు