వాయిదా పడిన సినిమాల.. విడుదల తేదీలు ఇవేనా?

కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేక్షకులకు ఎప్పుడూ నిరాశే ఎదురవుతోంది.విడుదల అవుతాయి అనుకున్న సినిమాలు వాయిదా పడుతూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాయి.2021 సంవత్సరం లోనే విడుదల అవుతాయి అనుకున్న ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి.ఇక 2021 ఏడాది చివర్లో అఖండ, పుష్ప లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలై భారీ విజయం సాధించడంతో ఒక రకంగా తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరి వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 Tollywood Postponed Movies Release Dates, Tollywood, Postponed, Radhya Shyam , R-TeluguStop.com

ఇక ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ లాంటి సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్దంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదు అని అనుకున్నారు ప్రేక్షకులు.

కానీ అంతలోనే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో కొన్ని రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ లు నిర్వహించేలా ఆంక్షలు అమలులోకి రావడంతో ఇక ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు వాయిదా పడటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.

దీంతో ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్న తమ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు అక్కినేని హీరోలు.అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కన్ఫ్యూషన్ మాత్రం పెరిగిపోయింది.

ఇప్పటికే వేసవిలో సినిమాలు విడుదల చేస్తాం అంటూ హీరోలు డేట్స్ కూడా ప్రకటించారు.కానీ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు బరిలో దిగితే సినిమా విడుదల వాయిదా వేసు కోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు అన్నది అందరికి తెలిసిందే.

Telugu Acahrya, Chiranjeevi, Kgf Beest, Radhya Shyam, Rajamouli, Ram Charan, Tol

దీంతో ప్రస్తుతం ఎన్నో సినిమాల విడుదల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది.ఈ క్రమంలోనే వేసవిలో విడుదలయ్యే సినిమాల విషయంలో ఇక ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Acahrya, Chiranjeevi, Kgf Beest, Radhya Shyam, Rajamouli, Ram Charan, Tol

ఇక మార్చి 18వ తేదీన ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదల కాబోతుందట.ఏప్రిల్ 1వ తేదీన చిరంజీవి ఆచార్య విడుదల కాబోతుండగా.ఆ తర్వాత ఏప్రిల్ 29న ఇటీవలే వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఏప్రిల్ 14వ తేదీన కేజిఎఫ్ వర్సెస్ బీస్ట్ పోటీ పడుతున్నాయి.

ఇక మే 1వ తేదీన మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదల కాబోతున్నట్లు కొన్ని డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube