Tollywood New Trend: టాలీవుడ్ లో మొదలైన కొత్త ట్రెండ్… ఇలాంటి మేకప్ వాడితే సినిమా హిట్ అయినట్టే !

సినిమా ( Movie ) పోకడ వింతగా మారుతున్న రోజులు ఇవి.ఒక్కో జనరేషన్ ఒక్కో స్టైల్ లో ముందుకెళుతుంది అని చెప్పడానికి కూడా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

 Tollywood New Trend Movies Kgf Pushpa Dasara-TeluguStop.com

కొన్నాళ్లపాటు ఒకే రకమైన సినిమాలను తీస్తూ ఉంటారు ఇండస్ట్రీలో వారు ఒకటి ఏదైనా హిట్టు కొడితే దాని అనుకరిస్తూ మరిన్ని సినిమాలు తీయడం అందరికీ అలవాటుగా మారిపోయింది.అలాంటి దోవలోనే కేజిఎఫ్ సినిమా( KGF ) హిట్ అయిన తర్వాత అందరూ నల్ల రంగులు ఎక్కువగా కనిపిస్తే తమ సినిమా హిట్ అవుతుంది అని భావిస్తున్నారు.

కే జి ఎఫ్ రెండు పాటలు కూడా విపరీతమైన బ్లాక్ కలర్ షేడ్ లో కనిపిస్తాయి బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు అనే విధంగా వీరి చిత్రాలు ఉంటాయి.కావలసినంత దుమ్ము, నలుపు రంగు కనిపించడం వల్లే ఈ చిత్రం హిట్ అయిందని గట్టిగా నమ్ముతున్న మన ఇండస్ట్రీ అలాంటి మరిన్ని చిత్రాలను ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

Telugu Allu Arju, Blackcolor, Black Color, Dasara, Kabza, Mass, Nani, Trend, Pus

అందుకు అనుగుణంగానే వచ్చిన మొదటి సినిమా పుష్ప.( Pushpa ) ఈ చిత్రంలో ఊర మాస్ భాషలో మాట్లాడుతూ తన కలర్ ని కాస్త డల్ చేసుకొని నలుపు రంగు ఎక్కువగా కనిపించే విధంగా అల్లు అర్జున్ తన బాడీ మేకోవర్ చేసుకుంటూ నటించాడు.అలాగే ఈ సినిమాలోని కథకు తన మేకోవర్ సెట్ అవ్వడంతో సినిమా మంచి హిట్ అయింది.ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది.అప్పటివరకు తెలుగులోనే స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.

Telugu Allu Arju, Blackcolor, Black Color, Dasara, Kabza, Mass, Nani, Trend, Pus

ఇక దసరా సినిమా( Dasara movie ) సైతం ఇలా పూర్తిగా నలుపు రంగులోనే కనిపిస్తూ ఉంటుంది.నాని బొగ్గు గల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంచుకోవడంతో ఇది కూడా కేజిఎఫ్ తరహాలోనే మాస్ సినిమాగా నిలబడే అవకాశం ఉంది.ఇటీవల ఒక టీవీ ఛానల్ కి గెస్టుగా వచ్చిన నాని నల్లరంగు వేసుకోవడానికి రెండు గంటలు పట్టిందంటూ వెటకారంతో సరదాగా మాట్లాడడం వైరల్ గా మారింది.

ఇక మొన్నటికి మొన్న ఉపేంద్ర నటించిన కబ్జా సినిమా సైతం కేజిఎఫ్ సినిమాను పోలినట్టుగానే పూర్తిస్థాయి నలుపు రంగు చిత్రంగా కనిపిస్తుంది సినిమాలో వీలైనంత వరకు బ్లాక్ షేడ్స్ వాడటం బ్లాక్ మేకప్ వేయడం లాంటివి చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు దీనికి ముఖ్య కారణం అని చెప్పక తప్పదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube