వైరల్ అవుతున్న నాని ఒకప్పటి ఫొటోస్.. అప్పట్లోనే?

సినిమాలలో నటించాలనే కల పట్టుదలతో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్న హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతూనే సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని అష్టా చమ్మా సినిమా ద్వారా తెరపై కనిపించారు.

 Tollywood Natural Star Nani Special Photos Going Viral In Social Media-TeluguStop.com

నాని సినిమాలో ఎంతో సహజంగా నటిస్తూ నాచురల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉండే నాని ఏ మాత్రం ఖాళీ దొరికినా తన కుటుంబంతో సరదాగా గడుపుతారు.

 Tollywood Natural Star Nani Special Photos Going Viral In Social Media-వైరల్ అవుతున్న నాని ఒకప్పటి ఫొటోస్.. అప్పట్లోనే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ మధ్య కాలంలో నాని సోషల్ మీడియాలో కూడా ఎంతో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.ఇక తాజాగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా నాని తన చిన్నప్పటి జ్ఞాపకాలను, స్నేహితులను గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా గతంలో తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన స్నేహితులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే నాని షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని ఎంతోమంది కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఇక సినిమాల విషయానికి వస్తే నాని నటించిన టక్ జగదీష్విడుదలకు సిద్ధంగా ఉంది.అదే విధంగా నాని హీరోగా శ్యామ్ సింగరాయ్సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది.

#NaniWith #NaniWith #NaniSpecial #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు