2022.. ఫస్ట్ హాఫ్ లో దుమ్మురేపనున్న మల్టీస్టారర్ మూవీస్..

గత ఏడాది కరోనా మూలంగా నానా ఇబ్బందులు పడిన తెలుగు సినిమా పరిశ్రమ. ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడుతుంది.

 Tollywood Multistarrers In 2022 Rrr Acharya Bheemla Nayak Details, Multistarrer-TeluguStop.com

అంతేకాదు.ఈ ఏడాది తొలి నెలల్లో క్రేజీ సినిమాలు జనాల ముందుకు రాబోతున్నాయి.

వాటిలో చాలా సినిమాలు మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కాయి.ఈ క్యాలెండర్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే ఈ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

సంక్రాంతికి రిలీజ్ అయిన బంగార్రాజు సినిమా కూడా మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.జనాల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

ఇందులో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగ చైతన్య కలిసి నటించారు.ఈ సినిమాను జనాలు బాగానే ఆదరించారు.

అటు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మల్టీ స్టారర్ మూవీనే.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్ నటిస్తున్నాడు.ఫిక్షనల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న జనాల ముందుకు రానుంది.మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ నటించిన సినిమా ఆచార్య.

సోషల్ డ్రామాతో ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రం ఏప్రిల్ 1న సమ్మర్ బరిలో నిలువనుంది.

Telugu Multirers, Acharya, Bheemla Nayak, Chiranjeevi, Multirer, Naga Chaitanya,

పవన్ కల్యాన్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనున్ కోషియం సినిమాకు రీమేక్ గా రెడీ అవుతోంది.సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన కామెడీ మూవీ ఎఫ్-2కు సీక్వెల్ గా ఎఫ్-3 అనే సినిమా జనాల ముందుకు రాబోతుంది.

Telugu Multirers, Acharya, Bheemla Nayak, Chiranjeevi, Multirer, Naga Chaitanya,

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.మొత్తంగా తక్కువ గ్యాప్ లో పలు మల్టీస్టారర్ సినిమాలు జనాల ముందుకు వస్తున్నాయి.ఈ సినిమాల్లో ఏ సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube