కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన పలు సినిమాలు మంచి విజయం సాధించాయి.పరాజయాన్ని మూటగట్టుకున్న సినిమాలు సైతం డబ్బులు బాగానే వసూలు చేశాయి.
కానీ కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ సంపాదించుకున్నా.పెద్దగా పైసా వసూల్ చేపట్టలేదు.ఇంతకీ హిట్ టాక్ వచ్చి బ్రేక్ ఈవెన్ రాని సినిమాలెంటో ఇప్పుడు చూద్దాం.
కపటదారి
సుమంత్-ప్రదీప్ కృష్ణమూర్తి కాంబోలో వచ్చిన ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించలేక పోయింది.ఈ సినిమా సుమంత్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది.
చెక్
చంద్ర ఏలేటి దర్శకత్వంలో నితిన్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమా రెడీ అయ్యింది.ఈ మూవీ విడుదల అయ్యాక.హిట్ టాక్ సంపాదించింది.కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కూడా కొట్టలేకపోయింది.
అక్షర
నందిత శ్వేత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం మొదట్లో మంచి టాక్ తెచ్చుకున్నా వారం తర్వాత ప్యాకప్ అయ్యింది.ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది.
ఎ1 ఎక్స్ ప్రెస్
డెన్నిస్ జీవన్- సందీప్ కిషన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు మంచి టాక్ వచ్చింది.కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు చేయలేకపోయింది.
షాదీ ముబారక్
పద్మశ్రీ డైరెక్షన్లో సాగర్ హీరోగా తెరకెక్కిన చిత్రం షాది ముబారక్.ఈ సినిమా హిట్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ మంచి కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
శ్రీకారం
శర్వానంద్- కిషోర్ కాంబోలో వచ్చిన మూవీ శ్రీకారం.ఈ సినిమా విడుదలై పాజిటివ్ తెచ్చుకున్నా.బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ కొట్టింది.
రంగ్ దే
నితిన్, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లు రూపొందిన సినిమా రంగ్ దే.వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.కానీ పెద్దగా డబ్బులు సాధించలేదు.
అరణ్య
రానా- ప్రభు సాల్మన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అరణ్య.ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా.డిజాస్టర్ గా మిగిలింది.
వైల్డ్ డాగ్
నాగార్జున- ఆషిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా డిజాస్టర్ గా నిలిచింది.
వకీల్ సాబ్
పవన్ కళ్యాణ్ తాజా సినిమా వకీల్ సాబ్.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.లాక్ డౌన్ మూలంగా ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ రాలేదు.