థియేట‌ర్‌లో 1000 కి పైగా రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!

సినిమా హీరోల కోసం ఏమైనా చేసెయ్య‌డానికి అభిమానులు ఎంతో మంది ఉన్నారు.త‌మ అభిమాన హీరో సినిమా వ‌స్తుందంటే చాలు వేయిక‌ళ్ల‌తో ఎదురుచూడ‌ట‌మే కాకుండా ఆ సినిమా బోర్ కొట్టేవ‌ర‌కూ చూస్తూనే ఉంటారు.

 Tollywood Movies Which Are Shown In Theaters More Than 1111 Days, Tollywood Movi-TeluguStop.com

ఇప్పుడైతే టీవీలు, సెల్‌ఫోన్లు అంటూ సోషల్ మీడియా, టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది గాని లేకపోతే థియేటర్లలో అప్పట్లో ఒక్కో సినిమా అయిదు వందల రోజులు వెయ్యి రోజులు ఆడేవి.అంతలా త‌మ ఫేవ‌రెట్ హీరోల సినిమాలను థియేటర్లలో ఆడించేవారు అభిమానులు.

అయితే ఇప్పుడు OTT వచ్చాకా మనకు అన్ని సినిమాలు మన సెల్‌ఫోన్లు లోనే ఉంటున్నాయి.అయితే మనం ఇందాకా చెప్పుకున్నట్టు థియేటర్లు పుట్టాక అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కువ రోజులు ఆడిన సినిమా జాబితాని ఇప్పుడొకసారి ఓ లుక్కేద్దాం.

1)1963లో వ‌చ్చిన ల‌వ‌కుశ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.ఇది అప్పట్లోనే రికార్డు స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయింది.

రాముడు గురించి అందరికి తెలుసు కానీ రాముడు కొడుకులు లవ కుశ గురించి ఎక్కువమందికి తెలియక పోవడం ఆ సినిమాలో సీతమ్మ కష్టాలు, రాముడి వేదన.కన్న కొడుకులతోనే యుద్ధం.

ఇవన్నీ చూసి ప్రజలు ఈ సినిమాకి ఫిదా అయిపోయారు.ఇక మన పెద్దాయన ఎన్టీఆర్ గారి గురించి చెప్పేదేముంది.

ఆయన నట విశ్వరూపుడు.అందుకే ఈ సినిమా థియేటర్లలో 1111 రోజులు ఆడింది.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

2) 1978లో వ‌చ్చిన మ‌రో చ‌రిత్ర సినిమా 556 రోజులు ఆడింది.స్టార్ డైరెక్టర్ బాలచంద్ర గారి ప్యూర్ లవ్ స్టోరీ, కమల హస్సన్ గారి నటన ఈ సినిమాకి ఎంతో ప్లస్ అయ్యాయి అండ్ ఈ సినిమాలోని సంగీతం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

3) నట విశ్వరూప ఎన్టీఆర్ గారు పౌరాణిక సినిమాలను తీయడం ఆపేసిన తర్వాత ఒక మంచి కమర్షియల్ ఫిలింతో 1977లో అడ‌వి రాముడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా ఒక సంవ‌త్స‌రానికి పైగానే థియేటర్లలో ఆడింది.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

4) ఇక 1979లో వ‌చ్చిన ఎన్టీఆర్ గారి వేట‌గాడు సినిమా కూడా అప్పట్లో 408 రోజులు థియేట‌ర్‌లో సంద‌డి చేసింది.ఈ సినిమాలోని ఆకు చాటు పిందె తడిసే, పుట్టింటోళ్ళు తరిమేశారు లాంటి సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ ఆయ్యాయి.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

5) 1981లో రిలీజ్ అయిన ప్రేమాభిషేకం సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలిసిందే.ఓ థియేట‌ర్‌లో 533 రోజులు, మ‌రో థియేటర్‌లో 300 రోజులు ఆడింది ఈ సినిమా.ఇందులో నాగేశ్వరావు గారి నటన, శ్రీదేవి గారి అందం, ఒకమంచి కథ.బలేఉంటుంది.నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టదు.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

6) 1983లో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చిన ప్రేమ‌సాగ‌రం సినిమా 465 రోజులు ఆడింది.ఇది కూడా మంచి కధాంశంతో తెరకెక్కిన సినిమా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దగ్గర నుండి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అన్ని కూడా టి.రాజేంద్రన్ గారే.అలా ఈయన ప్రాణం పెట్టి ఈ సినిమాని నిర్మిస్తే.కమల హస్సన్ గారు ఈ సినిమాకి అయన నటనతో ప్రాణం పోశారు.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

7) ఇక 1984లో రిలీజైన బాల‌య్య సినిమా మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు 567 రోజులపాటు ఆడింది.ఈ ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన బాలయ్య బాబు హవా మొదలైంది.అక్కడ నుండి బాలయ్య సినిమా రిలీజ్ అంటే చాలు ధియేటర్ల దగ్గర వేరే లెవల్లో హంగామా ఉంటుంది.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

8) ఇక 2009లో వచ్చాడ్రా రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి మెగాస్టార్ చిరంజీవి కొడుకు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.మ‌గ‌ధీర అనే సినిమా మన తెలుగు వాళ్ళని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.మనకు నిజమైన థియేటర్ ఎక్సపీరియన్స్ ని పరిచయం చేసింది.రాజమౌళి గారి డైరెక్షన్, రామ్ చరణ్ గారి యాక్టింగ్, సినిమా కథ, కథనం, సంగీతం, కాజల్ అందాలు అబ్బో.

ఈ సినిమాలో లేనిదంటూ లేదు అందుకే ఈ సినిమా 1001 రోజులు థియేటర్లలోనే ఆడింది.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

9) ఇక మిల్క్ బాయ్ మ‌హేష్‌బాబుని సూపర్ స్టార్ గా మార్చిన సినిమా పోకిరి సినిమా.ఈ సినిమా థియేటర్లలో వెయ్యి రోజులు ఆడింది.ఈ సినిమాని ఎన్నో సార్లు ధియేటర్ వాళ్ళు ఫ్రీగానే షో వేశారు.

ఈ సినిమా నుండే మహేష్ ని అభిమానించేవాళ్ల కంటే ఆరాధించేవారు ఎక్కువైపోయారు.ఇందులో పూరి గారి మాయ కూడా ఉందనుకోండి.

Telugu Adavi Ramudu, Lava Kusa, Maro Charitra, Premabhishekam, Shown Theaters, T

10) ఇక చాలా కాలం తర్వాత మన బాల‌కృష్ణ గారు లెజెండ్ అనే సినిమాతో బౌన్స్ బ్యాక్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి మా బాలయ్య బాబుకి ఇచ్చినన్ని ఎలివేషన్ లు మేము ఏ సినిమాలో చూడలేదు.అసలు బాలయ్య ఫ్యాన్స్ కి ఏం కావాలో అన్ని మసాలాలు ఇచ్చి వదిలేసాడు.అందుకే లెజండ్ సినిమా థియేటర్లలో 1005 రోజులు ఆడింది.

ఇలా త‌మ అభిమాన హీరో సినిమాను ప్రేక్షకదేవుళ్ళు థియేట‌ర్‌లో ఎక్కువ రోజులు చూస్తూ రికార్డులు సృష్టించేలా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube