సినిమాలు అనేవి.మానసికి ఆనందాన్ని కలిగించడానికే కాదు.
జనాల్లో పెను మార్పులు రావడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి.సినిమాల ద్వారా ఉద్యమాలు వచ్చిన సందర్భాలున్నాయి.
అన్యాయాలను తమ సినిమాల ద్వారా జనాలకు చేరవేసిన దర్శకులున్నాయి.ఓ జనచైతన్య మాధ్యమంగా సినిమాలు నిలిచేవి.
అయితే.కొన్ని సినిమాలు మాత్రం ఆయా అంశాల కారణంగా పెద్ద వివాదాలకు కేంద్ర బిందువులుగా మారాయి.
కుల, మత, ప్రాంత, రాజకీయాల నేపథ్యంలో గొడవలకు దారితీశాయి.తెలుగు సినిమాల్లో వివాదాలకు కారణమైన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కొమురం భీం పాత్రను ముస్లింగా చూపించడం పట్ల గొడవ మొదలైంది.ఈ ఘటన పట్ల గోండులతో పాటు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది.సైరా
చిరంజీవి ఈ సినిమా చేయడంతోఉయ్యాలవాడ వంశస్తులు ఆందోలన చేశారు.తమకు ఆర్ధికంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అజ్ఞాతవాసిపవర్ స్టార్ చేసిన ఈ మూవీలో కోటేశ్వర రావు పేరుతో ఓ పేరడీ సాంగ్ చేశారు.
ఈ పాటను వ్యతిరేకిస్తూ ఓ లాయర్ కోర్టులో కేసు వేయడంతో వివాదం చెలరేగింది.కెమెరామెన్ గంగతో రాంబాబు
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొన్ని సీన్లు ఉన్నాయంటూ అప్పట్లో వివాదం జరిగింది.అర్జున్ రెడ్డి
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా పోస్టర్లు తీవ్ర దుమారం రేపాయి.పలువురు రాజకీయ నాయకులు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు.రంగస్థలం
రాంచరణ్ నటించిన ఈ సినిమాలో రంగమ్మా రంగమ్మా అనే పాట బాగా పాపులర్ అయ్యింది.ఇందులో గొల్లభామ అనే పదంపై కొందరు అభ్యంతరం చెప్పడంతో దాన్ని గోరువంకగా చేంజ్ చేశారు.గద్దలకొండ గణేశ్
ఈ సినిమాకు వాల్మీకి అని పేరు పెట్టార.రేపు రిలీజ్ అనగా వారి సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.దీంతో టైటిల్ మార్చారు.దేనికైనా రెడీ
ఈ సినిమాలో హిందూ, ముస్లిం క్యారెక్టర్లు వివాదాస్పదం అయ్యాయి.
బ్రాహ్మణుల మీద చేసిన పాత్రపై అభ్యంతరాలు వచ్చాయి.మగధీరఈ సినిమాలో తన అనుమతి లేకుండా ఏం పిల్లడో ఎల్దాం వస్తవా అనే పాటను వాడుకున్నరని కవి వంగపండు ఆందోళన చేశాడు దీంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.ఆపరేషన్ దుర్యోధన
ఈ సినిమా తెలంగాణ ఉద్యమాన్ని శంకించేలా ఉందని ఆందోళనలు జరగడంతో కొన్ని సీన్లు తీసేశారు.అల్లుడా మజాకాఈ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయంటూ మహిళా సంఘాలు ఆందోళన చేశాయి.పోలీసు భార్యనరేశ్ హీరోగా చేసిన ఈ సిమా అసలు పేరు పోలీసోడి పెళ్లాం.పోలీసులు అభ్యంతరం చెప్పడంతో ఈ సినిమా పేరు మార్చారు.