ఆర్మీ అంటే దేశ ప్రజలందరికీ ఎంతో గౌరవం.దేశభక్తితో వచ్చిన సినిమాలనూ ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తారు.
తాజాగా ఆర్మీ రోల్స్ పోషించడానికి హీరోలు ఎంతో ఇష్టపడుతున్నారు.అలా ఆర్మీ బ్యాగ్రాఫ్‌లో తెలుగులో వచ్చిన సినిమాలు.ఆ సినిమాల్లో నటించిన హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం!
ఎన్టీఆర్:
నందమూరి ఎన్టీఆర్ బొబ్బిలి పులి సినిమాలో ఆర్మీ అధికారిగా కనిపించాడు.మేజర్ పాత్ర పోషించాడు.1982లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఏఎన్నార్:
జై జవాన్ సినిమాలో అక్కినేని నాగేశ్వర్‌రావు ఆర్మీ కెప్టెన్ గెటప్ లో కనిపించాడు.ఇందులో కెప్టెన్ రవీంద్ర క్యారెక్టర్ చేశాడు.1970లో విడుదల అయిన ఈ సినిమా బాగానే ఆడింది.
చిరంజీవి:
మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ సినిమాలో చిరంజీవి ఆర్మీ జవాన్ పాత్రలో కనిపించాడు.భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ సైన్యాన్ని ఆయన తరిమికొడతాడు.ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.
బాలకృష్ణ:
2004లో విడుదలైన విజయేంద్ర వర్మ సినిమాలో బాలకృష్ణ ఆర్మీ సైనికుడి పాత్రలో కనిపించాడు.పాక్ ఉగ్రవాదులను ఏరిపారేసే సైనికుడిగా మంచి నటన కనబరిచాడు.
నాగార్జున:
విమానం హైజాకింగ్ నేపథ్యంలో వచ్చిన గగనం సినిమాలో నాగార్జున ఆర్మీ అధికారిగా చేశాడు.తన టెక్నిక్స్ తో ప్రయాణికులను విడిపించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
జగపతి బాబు:
పటేల్ సర్ సినిమా జగపతి బాబు హీరోగా విడుదల అయ్యింది.ఇందులో ఆయన ఆర్మీ రిటైర్డ్ మేజర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.
రాజశేఖర్:
1991లో విడుదలైన ఆగ్రహం సినిమాలో రాజశేఖర్ నటించాడు.ఇందులో ఆయన ఆర్మీ అధికారిగా కనిపిస్తారు.ఆయనతో జంటగా అమల నటించింది.
మహేష్‌బాబు:
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మేజర్ అజయ్ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడు.భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఏరివేసే పాత్రలో ప్రిన్స్ అద్భుతంగా నటించాడు.
అల్లు అర్జున్:
అల్లు అర్జున్ మెయిన్ రోల్‌గా తెరకెక్కిన చిత్రం నాపేరు సూర్య, నాఇల్లు ఇండియా.ఇందులో యాంగ్రీ సోల్జర్‌గా అల్లు అర్జున్ కనిపించాడు.తన క్యారెక్టర్ ఎంతో ఆకట్టుకుంటుంది.
విక్కీ కౌషల్:
ఉరి సినిమాలో విక్కీ కౌషల్ పారా మిలటరీ కమెండో టీంకు నాయకత్వం వహిస్తాడు.పాకిస్తాన్ లోపలికి వెళ్లి ఉగ్రవాదుల లాంచ్ పాడ్స్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు.ఈ సినిమాలో ఆయన నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది.