తెలుగు లో హిట్ అయ్యిందని బాలీవుడ్ లో తీసి బొక్క బోర్లా పడ్డ దర్శకులు

ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన సినిమా అప‌రిచితుడు.తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల అయిన ఈ సినిమా ఓ రేంజిలో హిట్ అయ్యింది.

 Tollywood Movies Turns Flop In Bollywood, Deva Katta, Prastanam, Raghava Lawrence, Gautam Menon, Prabhudeva, S. J. Surya, Kanchana, Khushi-TeluguStop.com

విక్ర‌మ్ చేసిన మూడు క్యారెక్ట‌ర్ అద్భుతంగా నిలిచాయి.త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాడు.

సౌత్ లో అప్ప‌ట్లో సంచ‌న‌ల విజ‌యం సాధించిన ఈ సినిమాను మ‌ళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు శంక‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇందులో హీరోగా ర‌ణ్ వీర్ ను ఎంపిక చేసుకున్నాడు.

 Tollywood Movies Turns Flop In Bollywood, Deva Katta, Prastanam, Raghava Lawrence, Gautam Menon, Prabhudeva, S. J. Surya, Kanchana, Khushi-తెలుగు లో హిట్ అయ్యిందని బాలీవుడ్ లో తీసి బొక్క బోర్లా పడ్డ దర్శకులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప‌రిచితుడు స్థాయిలో ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.

శంక‌రే కాదు.

గ‌తంలో చాలా మంది సౌత్ డైరెక్ట‌ర్లు త‌మ సొంత సినిమాల‌ను బాలీవుడ్ లో రీమేక్ చేశారు.అనుకున్నంత స్థాయిలో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయారు.ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కులు ఎవ‌రు? ఆ సినిమాలు ఏంటి? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్ జే సూర్య‌

Telugu Deva Katta, Gautam Menon, Kanchana, Khushi, Prabhudeva, Prastanam, Surya-Telugu Stop Exclusive Top Stories

త‌న కెరీర్ లో బెస్ట్ మూవీ ఖుషి.ఇదే సినిమాను హిందీలో ఇదే పేరుతో 2003లో రీమేక్ చేశాడు.కానీ బాలీవుడ్ లో ఈ మూవీ బోల్తా కొట్టింది.ఇక్క‌డ విజ‌యం సాధించి అక్క‌డ ప‌రాజ‌యాన్ని మూట‌గట్టుకుంది.

ప్ర‌భుదేవా

Telugu Deva Katta, Gautam Menon, Kanchana, Khushi, Prabhudeva, Prastanam, Surya-Telugu Stop Exclusive Top Stories

ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి సంచ‌న‌ల విజ‌యం సాధించిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా.ఈ సినిమాను బాలీవుడ్ లో ర‌మ‌యా వ‌స్త‌వ‌యా పేరుతో రీమేక్ చేశారు.కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది.

గౌత‌మ్ మీనన్

Telugu Deva Katta, Gautam Menon, Kanchana, Khushi, Prabhudeva, Prastanam, Surya-Telugu Stop Exclusive Top Stories

గౌత‌మ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఏమాయ చేసావె సినిమా ఏక్ దివానా తా పేరుతో రీమేక్ చేశాడు.కానీ డిజాస్ట‌ర్ అయ్యింది.

రాఘ‌వ లారెన్స్

Telugu Deva Katta, Gautam Menon, Kanchana, Khushi, Prabhudeva, Prastanam, Surya-Telugu Stop Exclusive Top Stories

రాఘ‌వ లారెన్స్ తెలుగులో హిట్ కొట్టిన కాంచ‌న‌ సినిమాను ల‌క్ష్మీ బాంబ్ పేరుతో బాలీవుడ్ లో తీశాడు.కానీ విజ‌యం సాధించ‌లేదు.

దేవా క‌ట్ట‌

Telugu Deva Katta, Gautam Menon, Kanchana, Khushi, Prabhudeva, Prastanam, Surya-Telugu Stop Exclusive Top Stories

దేవా క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ ప్ర‌స్థానం.ఈ సినిమాను బాలీవుడ్ లో సంజ‌య్ ద‌త్ హీరోగా తీశారు.అస్స‌లు సినిమా ఎప్పుడు వ‌చ్చిందో.

ఎప్పుడు పొయ్యిందో కూడా తెలియ‌దు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube