బాక్సాఫీస్ వార్‌... రెండు సినిమాల బలాలు బలహీనతలు

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు సినిమా లు రాబోతున్నాయి.గత వారం విడుదల అయిన రామా రావు ఆన్ డ్యూటీ సినిమా వసూళ్ల పరంగా తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే.

 Tollywood Movies Sitaraamam And Bimbisara Movies Releasing Today , Tollywood Mov-TeluguStop.com

ఈ వారం రాబోతున్న రెండు సినిమా లు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనే నమ్మకం ను అంతా వ్యక్తం చేస్తున్నారు.సినిమా విడుదల సమయంలో అందరు చెప్పే మాటలు అవే అయినా కూడా కొన్ని సినిమాల విషయంలో వారి నమ్మకం నిజం అవుతుంది.

బింబిసార సినిమా విషయానికి వస్తే హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్‌ ఇప్పటి వరకు సక్సెస్‌ ను దక్కించుకోలేక పోయాడు.ఆయన ఈ సినిమా తో గట్టి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బింబిసార అనే ఇంట్రెస్టింగ్‌ పాత్ర తో సినిమా ను చేయడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించడం లో సక్సెస్ అయ్యాడు.ఇక రెండవ సినిమా సీతా రామం.

ఈ సినిమా కు దుల్కర్ సల్మాన్‌ అవ్వడం వల్ల అంచనాలు భారీగానే ఉన్నాయి.భారీ ఎత్తున ఈ సినిమా ను అశ్వినీదత్ టీమ్‌ ప్రమోట్‌ చేయడం వల్ల మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రెండు సినిమా ల్లో రెంటికి కూడా మంచి క్రేజ్ ఉంది.తప్పకుండా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తాయి అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నాయి.

ఒక వైపు వరుసగా ప్లాప్‌ లు పడుతున్న హీరో కాగా మరో వైపు వరుస ప్లాప్‌ లు దక్కించుకున్న దర్శకుడు.వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ శుక్రవారం మీదే ఉంది.

బింబిసార పై సీతరామం విజయాన్ని సొంతం చేసుకుంటున్నారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube