జులైలో విడుదల కాబోయే టాలీవుడ్ సినిమాలు ఇవే.. ఒకేసారి ఇన్ని సినిమాలా?

ఒక సినిమా విడుదలైన అంటే చాలు ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసే చూపులు అంతా ఇంతా కాదు.ఒక సినిమా మరో రెండు వారాల్లో విడుదల అవుతుంది అంటే ఇప్పటి నుండే ప్రేక్షకులు ఆ సినిమా కోసం తెగ ప్లాన్స్ చేస్తూ ఉంటారు.

 Tollywood Movies Releasing In July The Warrior Thank You Rocketry Thank You Deta-TeluguStop.com

ముఖ్యంగా ఒకే వారంలో రెండు మూడు సినిమాలు విడుదలైన అంటే చాలు ఏ సినిమాకు వెళ్లాలో అర్థంకాక తల పట్టుకుంటారు.

అదే ఒక నెలలో గ్యాప్ తో సినిమాలు విడుదల అవుతుంది అంటే.

ఆ నెల మొత్తం సిని ప్రియులకు పండగ అనే చెప్పాలి.ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాలు వరుసగా ఉంటే మాత్రం ఆ ఆనందం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు అలాంటి ఆనందమే వచ్చే నెలలో వస్తుంది.వచ్చేనెల జులైలో వరుసగా చాలా సినిమాలు విడుదలవుతున్నాయి.

అది కూడా తెలుగులోనే పలువురు స్టార్ హీరోల సినిమాలే విడుదల అవుతున్నాయి.ఇంతకు ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పక్కా కమర్షియల్:

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టెన్త్ క్లాస్ డైరీస్:

శ్రీరామ్, అవికా గోర్ నటీనటులుగా నటించిన సినిమా టెన్త్ క్లాస్ డైరీస్. రొమాంటిక్, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంజి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా కూడా జూలై 1న విడుదల కానుంది.

Telugu July, Karthi Keya, Pakka, Rocketry, Telugu, Tenth Class, Warrior, Tollywo

రాకెట్రీ:

స్వీయ దర్శకత్వంలో మాధవన్ నటించిన సినిమా రాకెట్రీ.ఇందులో సిమ్రాన్ కీలక పాత్రలో నటించింది.ఇక ఈ సినిమా కూడా పలు భాషల తో జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది వారియర్:

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రామ్ ది వారియర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉండగా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu July, Karthi Keya, Pakka, Rocketry, Telugu, Tenth Class, Warrior, Tollywo

హ్యాపీ బర్త్డే:

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో హ్యాపీ బర్త్డే సినిమాలో నటించగా ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుర్తుందా శీతాకాలం:

నాగ‌శేఖ‌ర్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఇందులో స‌త్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా జులై 15న విడుదల కానుంది.

Telugu July, Karthi Keya, Pakka, Rocketry, Telugu, Tenth Class, Warrior, Tollywo

థాంక్యూ:

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా థాంక్యూ. ఇందులో నాగచైతన్య కీలక పాత్రలో నటించగా ఈ సినిమా కూడా జులై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కార్తికేయ 2:

చందూ దర్శకత్వంలో రూపొందిన సినిమా కార్తికేయ.ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటీనటులుగా నటించారు.

ఇక ఈ సినిమా జులై 22న విడుదల కానుంది.ఇక వీటితో పాటు షంష , రామారావు ఆన్ డ్యూటీ వంటి పలు సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube