సినిమాలను తెరకెక్కించడమే కాదు.వాటిని ఓ రేంజిలో మార్కెట్ చేసుకోవాలి.
అప్పుడే జనాలకు చేరుతుంది.నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది.
ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే.ఓ మీడియా సమావేశం పెట్టి.
వివరాలు వెల్లడించేవారు.రిలీజ్ డేట్ సహా నటీనటుల పనితనం గురించి చెప్పేవారు.
కానీ ఇప్పుడు ప్రమోషన్ అర్థం పూర్తిగా మారిపోతుంది.సినిమాల ప్రమోషన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.
ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ ఉండగా ప్రస్తుతం సినిమాలోని పాటల్నే చాలా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు.అద్భుతంగా సెట్ వేసి.
రిచ్ లుక్ లో గెటప్పులు పెట్టి అదిరిపోయే రీతిలో ఈ పాటను షూట్ చేసి వదులుతున్నారు.ఈ ప్రమోషనల్ సాంగ్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు.
తాజాగా సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్ గతంలో ఎన్నడూ లేని మాదిరిగా జనాల ముందుకు వచ్చింది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఆయన కూడా యాక్టింగ్ చేసిన కళావతి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.పంచె కట్టు, లంగాఓణీలతో సింగర్స్, మ్యుజీషియన్స్ కనిపిస్తూ వారెవ్వా అనిపించారు.భారీగా డబ్బు ఖర్చు చేసి ఈ పాటను షూట్ చేశారు.సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాట జనాలను బాగా ఆకట్టుకుంటుంది.
అటు పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.ఈ సినిమాకు కూడా అద్భుతమైన ప్రమోషన్ సాంగ్ ఇచ్చాడు.
ఈ సినిమాలో మాస్ కాప్ గా పవన్ కనిపించనున్నాడు.ఆ గెటప్ లోనే అదరిపోయే పాటను జనాల్లోకి విడుదల చేశాడు.
అటు మరో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ప్రమోషనల్ సాంగ్స్ ను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.తాజాగా మూవీ బీస్ట్ అరబిక్ ప్రమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
తాజాగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ సాంగ్ కోసం నిర్మాత భారీగా ఖర్చు చేశాడు. చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో జనని ఎమోషనల్ సాంగ్ ని కాలభైరవతో రస్టిక్ లొకేషన్స్ లో తెరకెక్కించారు.దోస్తీ థీమ్ తో వచ్చిన పాటను చాలా అద్భుతంగా చూపించారు.ఎన్టీఆర్, చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పాటు సింగర్స్, డాన్సర్స్ తో అద్భుతంగా పాటను రిలీజ్ చేశారు.