వినాయక చవితికి రాబోతున్న సినిమాలివే !

కరోనా తర్వాత ఈ మధ్యనే థియేటర్స్ ఓపెన్ అయినా విషయం తెలిసిందే.అప్పటి నుండి వారం వారం థియేటర్స్ లో చిన్న సినిమాలు విదుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

 Tollywood Movies In Vinayaka Chavithi Race, Vinayaka Chavithi 2021, Tollywood Mo-TeluguStop.com

అయితే త్వరలో వినాయక చవితి రాబోతుంది.ఈ పండుగ సందర్భంగా చాలా సినిమాలు అభిమానులను అలరించడానికి థియేటర్స్ కు రాబోతున్నాయి.

థియేటర్స్ లోనే కాకుండా కొన్ని సినిమాలు ఓటిటి లో కూడా విడుదల కాబోతున్నాయి.

న్యాచ్యురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్‘ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ఓటిటి ద్వారా విడుదల కాబోతుంది.అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్ కాబోతుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సీటిమార్.

ఈ సినిమా కూడా వినాయక చవితి సందర్భంగా థియేటర్స్ లో విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమాలో తమన్నా, దిగంగన సూర్య వంశి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

Telugu Gopichand, Kangana Ranaut, Nani, Seetimaarr, Thalaivii, Tollywood, Tuck J

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ‘తలైవి‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా వినాయక చవితి కానుకగా అభిమానులను అలరించడానికి రెడీ అయ్యింది.ఈ సినిమా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయో పిక్ గా తెరకెక్కుతుంది.

ఇంకా వినాయక చవితి వారం రోజులపైనే ఉండడం వల్ల మరికొన్ని సినిమాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube