ఓటీటీలో కొత్త సినిమాలకు బ్రేక్.. కీలక నిర్ణయం?

గత ఏడాది నుండి కరోనా వైరస్ ఉండటంతో సినీ ఇండస్ట్రీలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా పడింది.దీంతో సినిమా థియేటర్లు బంద్ చేయడమే కాకుండా సినిమా షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి.

 Tollywood Movies In Ott Telangana State Film Chamber Of Commerce, Tollywood Movi-TeluguStop.com

ఇక ఆ సమయంలో కొన్ని సినిమాలు విడుదలకు ఉండగా థియేటర్స్ ఇక తెరుచుకోవడానికి సమయం ఉండటంతో చాలా వరకు సినిమాలన్నీ ఓటీటీ లో విడుదల చేశారు.ఇక అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ లు అందుకున్నాయి.

మరికొన్ని నష్టాలను ఎదుర్కొన్నాయి.

ఇక ఇప్పుడు కూడా పరిస్థితులు ఇలాగే ఉండటంతో స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.

ఇక కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా ఓటీటీ లో విడుదల చేయడానికి ముందుకు వస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో ఓటీటీ విడుదల కోసం తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్స్ సమావేశం శనివారం రోజు తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఫిలించాంబర్స్.

ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా థియేటర్లు ఇంకా తెరుచుకొని నేపథ్యంలో పలు సినిమాలు ఓటీటీ లో విడుదలకు సిద్ధంగా ఉండగా అందులో విడుదల చేయడానికి అక్టోబర్ 2021 వరకు వేచి ఉండాలని నిర్మాతలను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది.

దీంతో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కూడా స్పందించారు.అక్టోబర్ వరకు వేచి ఉండమని అప్పటివరకు థియేటర్లు తెరుచుకోకపోతే అప్పుడు ఓటీటీ లో విడుదల చేయవచ్చని నిర్మాతలకు తెలిపారు.

Telugu Telangana, Tollywood-Movie

ఇక ఫిలిం ఛాంబర్ తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని తమ విన్నపాన్ని పరిగణించమని నిర్మాతలను కోరుకున్నారు.లేదంటే తెలంగాణ ఎగ్జిబిటర్స్ భవిష్యత్ కార్యాచరణను త్వరలో తెలియజేస్తుంది అని.అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఓ మీటింగ్ నిర్వహించేందుకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించుకుందని తెలిపారు.దీంతో ఈ నెల 7న ఈ మీటింగ్ ను రామానాయుడు బిల్డింగ్, కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube