సినిమాలు ఫ్లాప్ అయినా.. ఆయా పాత్రలు అదర్స్..

హిట్.ఫట్ అనే దానితో సంబంధం లేదు.

 Tollywood Movies Flop But Hit Roles Details, Tollywood Heroes, Hit Characters, M-TeluguStop.com

కొన్ని సినిమాల్లో కొందరు నటుల నటనను చూస్తే వారెవ్వా అనక తప్పదు.కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా వారి నటనను మరువలేము.

అద్భుతమైన నటనతో మాయ చేసిన వారున్నారు.అయితే అలాంటి నటన కనబర్చినా సినిమా ఫెయిల్ కావడంతో వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.

బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా.అందులో ఎన్నో బెస్ట్ ఫర్పార్మెన్స్ లున్నాయి.

బస్తీ బాలరాజుగా అదరగొట్టిన కార్తికేయ.పలు సినిమాలో నటించి మెప్పించాడు.

అలా ఫ్లాప్ అయినా.నటన పరంగా అదరగొట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చావు కబురు చల్లగా సినిమాలో కార్తికేయ నటన చూస్తే వారెవ్వా అనాల్సిందే.అటు నిజం సినిమాలో మహేష్ బాబు నటన చూసి అదుర్స్ అనక ఉండలేం.నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయినా.అల్లు అర్జున్ నటనను ఎవరూ మర్చిపోలేరు.

గౌతమ్ నందా సినిమా పోయినా.గోపీచంద్ విలనిజం చూసి జనాలు వణికిపోయారు.

బ్రహ్మోత్సవం సినిమా అట్లర్ ఫ్లాప్ అయినా.రావు రమేష్ పాత్రను మరువలేం.

Telugu Balakrishna, Dear Comrade, Etovelli, Karthikeya, Mahesh Babu, Nijam, Ntr

ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అయినా.బాలయ్య పాత్రను మర్చిపోలేం.ఎటో వెళ్లిపోయింది మనసు అంతగా ఆడలేదు.కానీ సమంతా నటనతో నంది అవార్డును అందుకున్నాడు.జెండా పై కపిరాజు సినిమా ప్లాప్ అయినా.ఇందులో మాయా ఖన్నన్ పాత్ర చాలా చక్కగా పోషించింది.

స్పైడర్ డిజాస్టర్ అయినా.ఎస్‌జే సూర్య పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.

Telugu Balakrishna, Dear Comrade, Etovelli, Karthikeya, Mahesh Babu, Nijam, Ntr

డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినా.విజయ్ దేవరకొండ పాత్ర వారెవ్వా అనిపించింది.నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయినా.మహేష్ నటనకు జనాలు సెల్యూట్ చేశారు.ఈ సినిమా క్లైమాక్స్ చూసిన వారు ఎవరైనా అద్భుతం అనక తప్పదు.మొత్తంగా సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన అందరి నటన బాగాలేదు అని చెప్పలేం.

అందుకే సినిమా జయాపజయాలు కామన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube