మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వెలవెల.. వాళ్లు మంచి ఛాన్స్ మిసయ్యారు

టాలీవుడ్ బాక్సాఫీస్ గత మూడు వారాలుగా వెల వెల బోతోంది.వరుసగా వచ్చిన సినిమాలు ప్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా ఉండటం లేదు.

 Tollywood Movies Box Office Collections Very Sad , Flim News, Ramarao On Duty ,-TeluguStop.com

ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాకు కూడా పాతిక నుండి 30 కోట్లు వచ్చిన దాఖలాలు లేవు.గత మూడు నాలుగు వారాల్లో వచ్చిన సినిమాల్లో మినిమమ్ ఆడిన సినిమాలు అంటే వెంటనే చెప్పడానికి ఏమీ లేవు.

గత వారం వచ్చిన రామారావు ఆన్‌ డ్యూటీ ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.ఆ సినిమా సాధిస్తున్న వసూళ్లను మనం అందరం చూస్తూనే ఉన్నాం.

అంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దాంతో వసూళ్ళ పరంగా చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుందని వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

స్టార్ హీరో లుగా పేరు ఉన్న వారు కూడా వసూళ్ల ను రాబట్టడం లో తీవ్రంగా వెనుకబడి పోతున్నారు.

ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం లో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు పదుల కోట్లు.వందల కోట్లతో సినిమాలు తీస్తూ ఉంటే కనీసం ఐదు పది కోట్ల వసూళ్లు కూడా నమోదు కాకుండా పరిస్థితి ఏంటి అంటూ సినిమా ఇండస్ట్రీ కి చెందిన నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వారం లో బింబిసార మరియు సీతారామం అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.రెండు సినిమాలు ఎలా ఉంటాయో అనేది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.వరుసగా నాలుగో వారం కూడా బాక్సాఫీస్ డీలా పడాల్సిందేనా లేదంటే ఆ రెండు సినిమాల్లో కనీసం ఒకటి అయినా లేదా రెండు కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తాయో చూడాలి.భారీ సినిమా లు ఈ రెండు మూడు వారాల్లో విడుదల కాక పోవడం వల్ల మంచి సమయం ని మిస్ అయినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube