సినిమా అంటే.చక్కటి డైలాగులు, మంచి పాటలు, అంతకు మించి యాక్షన్ సీన్లు.
అన్నీ సమపాళ్లలో కుదిరితేనే సినిమా హిట్ అవుతుంది.లేదంటే ఫట్ అవుతుంది.
ఆయా సినిమాల్లోని డైలాగులు జనాలకు చాలా రోజులు గుర్తుండేవి ఉంటాయి.కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు సైడ్ ఆర్టిస్టులు చెప్పే మాటలు కూడా చాలా ఆకట్టుకునేలా ఉంటాయి.
అయితే కొన్ని సినిమాల్లో కొందరు ఆర్టిస్టులు కేవలం ఓకే ఒక్క డైలాగ్ చెప్పి ఆకట్టుకున్న సందర్భాలున్నాయి.ఇంతకీ ఆ డైలాగులు చెప్పిన నటులు ఎవరు? ఏ సినిమాల్లో చెప్పారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మానందం- జూలాయి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జులాయి.ఇందులో అల్లు అర్జున్, ఇలియానా హీరో హీరోయిన్లుగా కలిసి నటించారు.
ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.ఈ సినిమాలో బ్రహ్మానందం హీరోకు బాబాయి పాత్రలో నటిస్తాడు.
సినిమాలో కొన్ని డైలాగులు మాత్రమే చెప్తాడు.కానీ తను ఉన్నంత సేపు జనాలను ఓ రేంజిలో ఆకట్టుకుంటాడు.
ప్రదీప్- అత్తారింటికి దారేది
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మరో సినిమా అత్తారింటికి దారేది.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.ఇందులో పవన్ కల్యాణ్- సమంత జంటగా నటించారు.ఇందులో సైడ్ ఆర్టిస్టుగా ప్రదీప్ నటించాడు.ఆయన సినిమాలో నిత్యం కనిపిస్తాడు.కానీ.
డైలాగులు చెప్పడు.ఒకే చోట తను చెప్పే ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది.
సమంత ఇంట్లో నుంచి వెళ్ళిపోగా.ఏముంది సిద్దు తో వెళ్ళిపోయింది అని చెప్తాడు.
అజయ్- అఖండ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అఖండ.ఇందులో బాలయ్య హీరోగా నటిస్తుండగా.ఆయనకు జతగా ప్రగ్యా జైశ్వాల్ యాక్ట్ చేస్తుంది.ఇందులో అజయ్ కీలక పాత్ర పోషించాడు.అయితే తను కూడా ఈ సినిమాలో ఎక్కువగా డైలాగులు చెప్పడట.ఒకే సందర్భంలో ఒకే ఒక్క డైలాగ్ చెప్తాడట.
ఈ డైలాగ్ అందరినీ ఆకట్టుకునేట్లు ఉంటుందట.