గత నెల మొత్తం 30 సినిమాలు వచ్చాయి, వాటి ఫలితం ఏంటో తెలుసా

కరోనా కారణంగా దాదాపు దాదాపు 10 నెలల పాటు థియేటర్లు మూత పడే ఉన్నాయి.గత ఏడాది డిసెంబర్ నుండి థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 Tollywood Movies 2021 February Collections Uppena Is The No 1 Movie 30-TeluguStop.com

అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనుమతులను ఇవ్వడం జరిగింది.డిసెంబర్‌ లో పెద్దగా సినిమా లు విడుదలకు ఆసక్తి చూపించలేదు.

ఇక జనవరిలో కాస్త పెద్ద సినిమాలు మరియు ఒక రేంజ్ చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.డిసెంబర్‌ మరియు జనవరి నెలల్లో సినిమాలు తక్కువే వసూళ్లు కూడా తక్కువే.

 Tollywood Movies 2021 February Collections Uppena Is The No 1 Movie 30-గత నెల మొత్తం 30 సినిమాలు వచ్చాయి, వాటి ఫలితం ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకటి రెండు సినిమాలు మినహా జనవరిలో పెద్దగా సినిమాలు ఏమీ కూడా ఆకట్టుకోలేదు.ఫిబ్రవరిలో నూరు శాతం ఆక్యుపెన్సీ కి ఓకే చెప్పడంతో భారీ ఎత్తున సినిమాలు విడుదల అయ్యాయి.

వరుసగా వచ్చిన సినిమా లు బాక్సాఫీస్ ముందు సందడి చేశాయి.భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమా ల్లో కొన్ని సక్సెస్‌ అవ్వగా కొన్ని నిరాశ పర్చాయి.

అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో పాటు మరి కొన్ని సక్సెస్‌ ను దక్కించుకున్నాయి.

మొత్తంగా ఫిబ్రవరి నెలలో 30 సినిమా లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అందులో ఉప్పెన సినిమా బ్లాక్‌ బస్టర్ సక్సెస్ గా నిలిచింది.50 కోట్ల కు దగ్గరగా షేర్‌ సాధించింది.గత ఏడాది కాలంగా విడుదల అయిన సినిమా ల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా చెప్పుకోవచ్చు.2021 మొదటి రెండు నెలల్లో ఉప్పెన టాప్ లో నిలుస్తుంది.ఇక ఉప్పెన కాకుండా నాంది సినిమా కూడా ఫిబ్రవరి లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కమర్షియల్‌ గా సక్సెస్ అయ్యింది.బ్రేక్‌ ఈవెన్‌ ను దక్కించుకున్న నాంది సినిమా అల్లరి నరేష్‌ కు సక్సెస్‌ టాక్‌ ను చూపించినట్లయ్యింది.ఇక జాంబీ రెడ్డి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించింది.ఈ మూడు సినిమా లు మినహా మిగిలిన అన్ని సినిమా లు కూడా ఇలా వచ్చి అలా వెళ్లి పోయాయి.30 లో కేవలం 3 మాత్రమే హిట్ గా నిలిచాయి.భారీ అంచనాల నడుమ విడుదల అయిన చెక్‌ సినిమా కూడా ఫ్లాప్‌ ల జాబితాలో చేరిపోయింది.కపటధారి ది క ఊడా అదే దారి.

#Kapatadhaari #Zombie Reddy #TeluguFilm #Uppena #Naandhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు