మరో మూడు నెలలు టాలీవుడ్‌ బంద్‌ కొనసాగనుందా?

తెలుగు సినిమా పరిశ్రమ గత రెండు నెలలుగా పూర్తిగా స్థంభించింది.టాలీవుడ్‌ మాత్రమే కాకుండా టీవీ పరిశ్రమ ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా షూటింగ్స్‌ జరగడం లేదు.

 Minister Talasani Yadav, Tollywood, Lockdown,movie Shootings-TeluguStop.com

తెలుగు సినిమా పరిశ్రమలో సినీ కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు.రెండు నెలల తర్వాత జూన్‌ లో షూటింగ్స్‌ మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అనుకుంటున్నారు.

ఇటీవల మంత్రి తలసాని మాట్లాడుతూ మరో నెల రోజులు ఆగండి జూన్‌ నుండి హ్యాపీగా షూటింగ్స్‌ చేసుకోవచ్చు అన్నాడు.

ఇప్పుడు ఆయన మళ్లీ మాట మార్చాడు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్స్‌కు అనుమతులు ఇస్తే ఖచ్చితంగా కరోనా ఉదృతి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.షూటింగ్స్‌ కోసం ఇతర రాష్ట్రాల నుండి టెక్నీషియన్స్‌ను మరియు నటీనటులను తీసుకు రావాల్సి ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు ఇక్కడకు రావడం, వీళ్లు అక్కడకు వెళ్లడం రెండు కూడా ప్రమాదమే.అందుకే షూటింగ్స్‌కు అనుమతించలేక పోతున్నామన్నాడు.

మరో రెండు లేదా మూడు నెలల వరకు షూటింగ్స్‌కు బ్రేక్‌ తప్పదని సినీ వర్గాల వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది.సీఎం కేసీఆర్‌కు ఈ విషయమై విజ్ఞప్తి చేసేందుకు సినీ ప్రముఖులు రెడీ అవుతున్నారు.

షూటింగ్స్‌కు అనుమతి ఇస్తే సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ కొద్ది మందితో చిత్రీకరణ చేస్తామని వారు చెబుతున్నారు.కాని సీఎం కూడా ఈ విషయంలో ఆసక్తిగా లేడని అంటున్నారు.

కనుక మరో మూడు నెలల వరకు క్లాప్‌ పడక పోవచ్చు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube