ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన  “శివ” అనే చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులను నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున సైకిల్ చైన్ ఫైట్ సన్నివేశం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.

 Tollywood Movie Shiva Successfully Completed 31 Years,shiva, Nagarjuna, Rgv, Amala-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా అక్కినేని అమల నటించగా విలన్ పాత్రలో ప్రముఖ స్వర్గీయ విలక్షణ నటుడు రఘువరన్ నటించాడు.కాగా ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి, మురళీమోహన్, చిన్న, ఉత్తేజ్, రామ్ జగన్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు

అయితే ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 31 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన మధుర స్మృతులను చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో పంచుకున్నారు.

 Tollywood Movie Shiva Successfully Completed 31 Years,Shiva, Nagarjuna, RGV, Amala-ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 ఇందులో భాగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసినటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  హీరో నాగార్జునకి సన్నివేశం వివరిస్తున్నట్లు తెసులుస్తోంది.

కాగా ఈ సినిమా వచ్చి 31 సంవత్సరాలు అయినప్పటికీ ఈ చిత్రంలోని నటీనటుల ప్రతిభ మరియు దర్శకుడు అద్భుతమైన దర్శకత్వ పని తీరు  ప్రేక్షకులను ఇప్పటికీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే అప్పటి వరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగార్జునకు శివ సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచి తన సినీ జీవితంలోనే మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో కింగ్ నాగార్జున “వైల్డ్ డాగ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో నాగార్జున ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు సమారం.కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కరోనా వైరస్, మర్డర్, ఎంటర్ ది గర్ల్ డ్రాగన్, అనే చిత్రాలకి దర్శకత్వం వహిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube