ఆ సినిమాలు రావాలంటే వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఆగాల్సిందేనా?

కరోనా వల్ల పదుల సంఖ్యలో సినిమాలు విడుదల వాయిదా పడుతూనే ఉన్నాయి.గత ఏడాది సమ్మర్లో విడుదల చేయాలనుకున్న కొన్ని సినిమాలు ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు.

 Tollywood Movie Release Postponed From Last Summer-TeluguStop.com

ఆ సినిమాలు ఏంటీ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు దాదాపుగా పది నుండి పదిహేను వరకు తెలుగు సినిమాలు విడుదల ముంగిట ఉన్నాయి.

గత సమ్మర్‌లో విడుదల వాయిదా పడ్డ ఆ సినిమాలు ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయానుకుంటే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ వాయిదా పడ్డాయి.సరే సెకండ్‌ వేవ్‌ ముగిసింది కదా అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.

 Tollywood Movie Release Postponed From Last Summer-ఆ సినిమాలు రావాలంటే వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఆగాల్సిందేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Aacharya, Film News, Movie News, News In Telugu, Pushpa, Rrr, Sarkari Vaari Pata, Tollywood-Movie

ఆర్‌ ఆర్‌ ఆర్‌.ఆచార్య.సర్కారు వారి పాట.పుష్ప.అఖండ ఇలా పలు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఇవి దసరా నుండి మొదలుకుని వచ్చే సంక్రాంతి వరకు కంటిన్యూస్‌ గా వారం లేదా రెండు వారాలకు ఒకటి చొప్పున విడుదలకు సిద్దం అవుతున్నాయి.

ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల తేదీలు ప్రకటించారు.మరి కొన్ని సినిమాలు మాత్రం విడుదల తేదీల విషయంలో స్పష్టత లేకుండా పోయింది.అయినా కూడా అవి ఈ గ్యాప్‌ లోనే వస్తాయని అంతా నమ్మకంగా ఉన్నారు.కనుక ఇతర సినిమాల విషయంలో మాత్రం విడుదలకు సమస్య ఏర్పడింది.

అవి విడుదల అవ్వాలంటే వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు వెయిట్‌ చేయాల్సి వస్తుంది.కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ మళ్లీ మొదలు అయితే మాత్రం ఆ సినిమాలు వచ్చే ఏడాది చివరికి వాయిదా పడాల్సి రావచ్చు అంటున్నారు.

మొత్తానికి ఆ చిన్న సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్దం గా ఉన్నా కూడా మరి కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి రావచ్చు.

#Pushpa #Aacharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు