హిందీ సినిమాల కంటే మన తెలుగు సినిమాలు నూరు శాతం నయం.. ఇదే సాక్ష్యం

ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమా లను సౌత్ సినిమాలు కనీసం టచ్ కూడా చేసేవి కావు.అంటే ఆ సినిమాలు వంద కోట్ల రేంజ్ లో ఉన్న సమయంలో మన సినిమాలు పాతిక కోట్లు సాధిస్తే చాలా గొప్ప విషయంగా చెప్పుకునే వారు.

 Tollywood Movie Getting More Collections Than Bollywood Movies , Bollywood, Toll-TeluguStop.com

అలాంటిది ఇప్పుడు మన సినిమా లు సునాయాసంగా వందల కోట్లు సాధిస్తున్నాయి.బాలీవుడ్‌ సినిమాలను మించి వసూళ్లు సాధిస్తూ తెలుగు సినిమా రేంజ్ ను మరో లెవల్‌ కు తీసుకు వెళ్లడం లో తెలుగు దర్శకులు మరో అడుగు అన్నట్లుగా ఏడాది ఏడాదికి దూసుకు పోతున్నారు.

ఇక ఈ ఏడాది పరిస్థితి చాలా విభిన్నంగా ఉంది.కరోనా లాక్ డౌన్ తర్వాత తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన చాలా మంది వ్యక్తం చేశారు.

కాని థియేటర్లు మూత పడుతాయని అనుకుంటే లాక్‌ డౌన్‌ తర్వాత హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్‌ లో గత రెండు నెలలుగా విడుదల అయిన సినిమాల్లో ఎక్కువ శాతం మంచి వసూళ్లు సాధించాయి.

క్రాక్‌.ఉప్పెన మరియు జాతి రత్నాలు.

ఈ మూడు సినిమాలు కలిపి దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.కాని బాలీవుడ్‌ సినిమా లు మాత్రం మరీ దారుణమైన ఫలితాలను చవి చూస్తున్నాయి.

గత రెండు నెలలుగా విడుదల అయిన ఏ ఒక్క సినిమా కూడా 50 కోట్లను మించలేదు.ఇక నిన్న విడుదల అయిన ముంబై సగ సినిమా దారుణంగా వసూళ్లను నమోదు చేసింది.2000 థియేటర్లకు పైగా ఈ సినిమా కోసం వేశారు.కాని మొదటి రోజు ఈ సినిమా కేవలం మూడు కోట్లను కూడా రాబట్టలేదు.

చాలా చోట్ల థియేటర్లు పలు షో లు ఆగిపోయాయి.ఇదే మన తెలుగు ప్రేక్షకులకు మరియు హిందీ ప్రేక్షకులకు తేడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube