టైటిల్ ఏదో వింతగా ఉందని ఆలోచిస్తున్నారా.అవునండి “చెప్పినా ఎవరూ నమ్మరు” అనేది ఒక సినిమా టైటిల్.
ఇదొక మంచి కధనట.
ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం పేరే ‘చెప్పినా ఎవరూ నమ్మరు’.
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, ఎం.మురళి, శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా థ్రిల్లింగ్, క్రైమ్, యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిందట.
ఇక ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమంలో నటీ నటులతో పాటుగా చిత్ర యూనిట్ పాల్గొన్నది.
కాగా చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రం ఈ రోజు పెద్ద సినిమాగా మారబోతుంది.మంచి కంటెంట్‌తో, ఈ మధ్య కాలంలో ఎవరూ ఊహించని విధంగా వస్తున్న ఈ చిత్రానికి ఏ.పి, తెలంగాణలో మంచి థియేటర్స్ దొరికాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిత్ర బృందం.అదీగాక ఈ సినిమా ద్వారా చిత్ర యూనిట్ కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.